Tea Side Effects: ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగితే ప్రమాదమేనట.. నిపుణులు ఏమంటున్నారంటే..
Tea Side Effects: ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఉదయం టీ వంటి కెఫిన్ పానీయాలు తీసుకోవడం వల్ల అంత మంచిది కాదని వైద్య నిపుణులు..
Tea Side Effects: ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఉదయం టీ వంటి కెఫిన్ పానీయాలు తీసుకోవడం వల్ల అంత మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఉదయం లేవగానే టీ తాగనిదే ఉండరు. కానీ పొద్దునే టీ తాగే వారికి అసిడిటీ సమస్య వచ్చే అవకాశం చాలా ఉందని సూచిస్తున్నారు. అసిడిటికి ప్రధాన కారణాలలో ఖాళీ కడుపుతో టీ తాగడం కూడా ఒకటి. ఉదయం టీ మీ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. పళ్లు తోముకోకుండా మీరు టీ తాగితే మీ నోటిలోని చెడు బ్యాక్టీరియాను పేగుల్లోకి వెళ్లి అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఉంది. అది మీ గట్ లో ఇది మంచి బ్యాక్టీరియాతో కలసి మీ జీవక్రియకు భంగం కలిగిస్తుంది. అలాగే కడుపు నొప్పి వస్తుంది. ఉదయం టీ తాగడంలో ఎలాంటి తప్పు ఉందో తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. టీతో రోజు ప్రారంభించకూడదని ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి.
► ఉదయాన్నే టీ తాగడం వల్ల మీ కడుపులో యాసిడ్ , ఆల్కలీన్ బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో చాలా సమస్యలు వస్తాయి.
► టీలో థియోఫిలిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది మలం మీద నిర్జలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మలబద్దకానికి కారణమవుతుంది. మీరు ఉదయాన్నే టీ తాగితే ఆరోగ్యకరమైన ఫైబరస్ డైట్, కలిసి వ్యాయామం మలబద్దకాన్ని నివారించడంలో అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు.
► ఉదయం నిద్రలేవగానే టీ తాగడం వల్ల ఇతర పోషకాలు శోషించడాన్ని నిరోధిస్తుంది.
► టీలో నికోటిన్ ఉండటం వల్ల మీరు పానీయానికి బానిసలుగా ఉండటానికి కారణం కావచ్చు.
► ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగిన తరువాత, నోటిలోని బ్యాక్టీరియా పేగుకు వెళుతుంది.
► కొంతమంది ఉదయం పాలతో చేసిన టీ తాగిన తర్వాత కూడా ఉబ్బినట్లు అనిపించవచ్చు.
► ఉదయాన్నే టీ తాగితే మీ మెటబాలిక్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే టీలో ఉండే పదార్థం మీ కడుపుపై అధిక ప్రభావం చూపుతుంది. మీ జీవక్రియపై ఎఫెక్ట్ చూపుతుంది.
► ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అల్సర్, హైపరాసిడిటీకి గురవుతారు. అలాగే స్కెలిటల్ ప్లోరోసిస్ అనే వ్యాధి బారిన పడతారు. ఈ వ్యాధి వల్ల ఎముకలను బలహీనంగా మారే ప్రమాదం ఉంది.
మరి ఏ సమయంలో టీ తాగాలి:
ఉదయం అల్పాహారం తీసుకున్న 1 గంట తర్వాత మీరు టీ తాగవచ్చు. టీ లేదా కాఫీ తాగడానికి ఉత్తమ సమయం భోజనం తర్వాత 1-2 గంటలు. మీరు దీన్ని ఉదయం కూడా తాగవచ్చు. కానీ దాన్ని ఎప్పుడూ ఖాళీ కడుపుతో తాగకూడదని గుర్తించుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి