AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oat Milk Benefits: ఓట్స్ మిల్క్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.. ఎంత ఈజీనో తెల్సా..?

Oat Milk Benefits: శాఖాహార పాలలో ఒకటిగా ఓట్స్ మిల్క్ కూడా ఫేమస్ అయింది. ఓట్స్ మిల్క్ ను తాగాలంటే.. మార్కెట్ నుండి ఖరీదైన ప్యాకేజీలను కొనుగోలు చేయడం కంటే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు.

Oat Milk Benefits: ఓట్స్ మిల్క్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.. ఎంత ఈజీనో తెల్సా..?
Oat Milk Benefits
Surya Kala
|

Updated on: Jun 11, 2022 | 9:22 PM

Share

Oat Milk Benefits: గత కొన్నేళ్లుగా ఆదరణ సొంతం చేసుకున్న ఆహారపదార్ధాల్లో ఒకటి ఓట్స్..  మన దేశానికి చెందినవి కాకపోయినా మంచి అదరణని సొంతం చేసుకుంది. దీనికి కారణం ఓట్స్ లో ఉన్న పోషక విలువలు పైగా తయారు చేసుకోవడం సులభం. అందుకనే ప్రస్తుతం ఓట్స్ భారతీయులు తినే ఆహారపదార్ధాల్లో ఒకటిగా చేరిపోయింది. ఓట్స్ సులభంగా జీర్ణం అవుతాయి. కొవ్వును కరిగిస్తుంది.. బరువు తగ్గిస్తాయి కనుక తినే డైట్ లో ఓట్స్ కు స్థానం దక్కింది. అయితే శాఖాహార పాలలో ఒకటిగా ఓట్స్ మిల్క్ కూడా ఫేమస్ అయింది. ఓట్స్ మిల్క్ ను తాగాలంటే.. మార్కెట్ నుండి ఖరీదైన ప్యాకేజీలను కొనుగోలు చేయడం కంటే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు.

 ఓట్స్  మిల్క్ తయారీ పధ్ధతి: 

ఒక కప్పు లేదా సుమారు 80 గ్రాముల వోట్స్‌ను తీసుకుని మూడు కప్పులు లేదా 720 ఎంఎల్ చల్లటి నీటిలో కొంచెం ఉప్పు వేసి నానబెట్టండి. ఇలా  30 సెకన్ల పాటు ఓట్స్ ని నీటిలో నానబెట్టండి.. తర్వాత వీటిని శుభ్రంగా కడిగి.. మిక్సీ చేయండి..అయితే ఓట్స్ పాలు రుచికరంగా ఉండడం కోసం కొద్దిగా వెనిల్లా లేదా దాల్చిన చెక్క పొడి,  కొన్ని ఖర్జూరాలు, చెరకు రసం లేదా తేనె కలపవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి.. పాలు తీసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఓట్స్  పాలను ఐదు రోజుల వరకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఓట్స్ మిల్క్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు: 

ఓట్స్ మిల్క్ లో గ్లూటెన్ , లాక్టోస్ లేవు.. దీంతో మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొంతమందికి ఆవు పాలకు బదులుగా ఓట్స్ మిల్క్ ని కూడా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

పుష్కలంగా విటమిన్ బి12  ఓట్స్  పాలలో రిబోఫ్లేవిన్ (B2),  B12, B వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అవసరమైనవిగా నిరూపించబడ్డాయి.

US NIH ప్రకారం.. ఓట్స్ మిల్క్‌లోని విటమిన్ B12 ఒత్తిడిని తగ్గించడానికి, ఆక్సీకరణ నష్టాన్ని నిరోధించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన జుట్టు , గోర్లు , చర్మాన్ని ఇస్తుంది.

LDLని తగ్గించడంలో సహాయపడుతుంది ఓట్స్ పాలల్లో బీటా-గ్లూకోన్   బీటా-గ్లూకోన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక రకమైన కరిగే ఫైబర్. గుండెకు మేలు చేస్తుందని నిరూపించబడింది. రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అని పిలువబడే LDL స్థాయిలు నియంత్రిస్తాయి ఓట్స్ పాలు. ఈ పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను మూడు శాతం నుంచి ఐదు శాతం తగ్గించవచ్చని తెలుస్తోంది.

ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయకారి..  ఓట్స్ పాలలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన ఎముకలకు ముఖ్యమైన పోషకాలు. తినే ఆహారంలో కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు పెళుసుగా మారతాయి. ఫలితంగా ఎముకల్లో పగుళ్లు లేదా విరిగిపోతాయి.

కనుక శరీరానికి విటమిన్ డి ముఖ్యమైన విటమిన్. జీర్ణవ్యవస్థ నుండి కాల్షియంను గ్రహించడంలో విటమిన్ డి సహాయ పడుతుంది. విటమిన్ డి లేకపోవడం వల్ల మీ శరీరానికి తగినంత కాల్షియం లభించకుండా చేస్తుంది. తద్వారా ఎముకలు బలహీనపడతాయి.

ఓట్స్ పాలలో విటమిన్ B12 ఉంటుంది. బోలు ఎముకల వ్యాధి బారిన పడకుండా చేస్తుంది. ఒక కప్పు ఓట్స్ పాలలో    విటమిన్ D ,  20 శాతం..  విటమిన్ B12   50 శాతం అందిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..