Health Tips: ఆల్కహాల్ మాత్రమే కాదు.. ఇవి కూడా మీ కాలేయాన్ని దెబ్బ తీస్తాయి.. అతిగా తీసుకుంటే ప్రమాదమే..

మీరు ఈ విషయాలపై శ్రద్ధ చూపితే.. మీ కాలేయం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. లేదంటే అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Health Tips: ఆల్కహాల్ మాత్రమే కాదు.. ఇవి కూడా మీ కాలేయాన్ని దెబ్బ తీస్తాయి.. అతిగా తీసుకుంటే ప్రమాదమే..
Liver Health
Follow us
Venkata Chari

|

Updated on: Jun 12, 2022 | 12:17 PM

రక్తం(Blood)లో ఉన్న రసాయనాలను సక్రమంగా నిర్వహించడం, శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడంలో కాలేయం(Liver) కీలక పాత్ర పోషిస్తుది. దీంతో కాలేయం మన శరీరంలోని రసాయన కర్మాగారంగా పేరుగాంచింది. ఇది మన శరీరంలో ఉన్న అతిపెద్ద ఏకైక అవయవం. తెలియకుండానే లివర్ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకుండా కొన్ని పనులు చేస్తుంటారు. దీంతో లివర్ పాడైపోవడం మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితిలో, ప్రజల అలవాట్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని కారణంగా కాలేయం క్రమంగా అధ్వాన్నంగా మారడం ప్రారంభమవుతుంది.

మీరు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మాత్రం.. ఎలాంటి పదార్థాలు తినాలి, ఎలాంటివి తినకూడదో ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే, మీ కాలేయానికి ఏ ఆహారం ఉపయోగకరంగా ఉంటుంది, ఏవి హాని కలిగించేవో కూడా తెలుసుకోవలి. అతిగా మద్యం సేవించడం, స్థూలకాయం కారణంగా కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి మీ కాలేయానికి చాలా ప్రమాదకరంగా మారే కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, పొరపాటున కూడా వీటిని తినకూడదు.

  1. చక్కెర – ఎక్కువ చక్కెర మీ దంతాలకు మాత్రమే కాదు, మీ కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాలేయం కొవ్వును తయారు చేయడానికి ఫ్రక్టోజ్ అనే చక్కెర రకాన్ని ఉపయోగిస్తుంది. అధిక మొత్తంలో శుద్ధి చేసిన చక్కెర, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తీసుకోవడం కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ మాదిరిగానే చక్కెర కాలేయాన్ని దెబ్బతీస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
  2. భారీ పరిమాణంలో విటమిన్ ఏ వినియోగం- శరీరానికి అనేక రకాల విటమిన్లు అవసరం. వాటిలో ఒకటి విటమిన్ ఏ. శరీరంలో విటమిన్ ఏ లోపాన్ని తాజా పండ్లు, కూరగాయలతో తీర్చవచ్చు. విటమిన్ ఏ ఎరుపు, నారింజ, పసుపు రంగుల పండ్లు, కూరగాయలలో అధిక మొత్తంలో లభిస్తుంది. కానీ, చాలా మంది విటమిన్ ఏ సప్లిమెంట్లను తీసుకుంటారు. విటమిన్ ఏ సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో, మీరు విటమిన్ ఏ సప్లిమెంట్లను తీసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా మీ వైద్యుడిని ఒకసారి సంప్రదించండి.
  3. ఇవి కూడా చదవండి
  4. తెల్ల పిండి – మీరు ఎల్లప్పుడూ తెల్ల పిండితో చేసిన ఆహారాన్ని తినకూడదు. ఇవి ఎక్కువగా ప్రాసెస్ చేస్తుంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అదనంగా, ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది. ఇటువంటి పరిస్థితిలో, మీరు పాస్తా, పిజ్జా, బిస్కెట్లు, బ్రెడ్ వంటి వాటి వినియోగాన్ని నివారించడం చాలా ముఖ్యం. వీటన్నింటిలో తెల్ల పిండిని ఉపయోగిస్తారు. వీటిని తీసుకోకపోవడం వల్ల మీ కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
  5. రెడ్ మీట్- ప్రొటీన్లు అధికంగా ఉండే ఎర్ర మాంసాన్ని జీర్ణం చేయడం మీ కాలేయానికి చాలా కష్టంగా మారుతంది. కాలేయం ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేయడం అంత సులభం కాదు. కాబట్టి, అదనపు ప్రోటీన్‌ల నిర్మాణం కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మెదడు, మూత్రపిండాలకు హాని కలిగించే కొవ్వు కాలేయ వ్యాధులతో సహా ఎన్నో అనర్థాలకు కారణమవుతుంటాయి.
  6. పెయిన్‌కిల్లర్స్- తలనొప్పి లేదా శరీరంలో నొప్పి ఉన్నప్పుడు పెయిన్‌కిల్లర్స్‌ను అధికంగా ఉపయోగిస్తారు. ఇటువంటి పరిస్థితిలో, మీరు ఎంత నొప్పి నివారణ మందులు తీసుకుంటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు అనుకోకుండా వాటిని అధికంగా తీసుకుంటే, అది మీ కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీ కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి డాక్టర్‌ని సంప్రదించిన తర్వాతే నొప్పి నివారణ మందులను వాడాల్సి ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసమే. ఇందులో పేర్కొన్న టిప్స్, చిట్కాలు పాటించాలనుకుంటే, కచ్చితంగా డాక్టర్ లేదా నిపుణులను సంప్రదించడం మంచింది.

ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన