Rana Daggubati: “ఆ ఒక్కరి కోసమే ఈ సినిమా చేశాను’.. రానా ఆసక్తికర వ్యాఖ్యలు..

నక్సలైట్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వరంగల్ లో విరాట పర్వం

Rana Daggubati: ఆ ఒక్కరి కోసమే ఈ సినిమా చేశాను'.. రానా ఆసక్తికర వ్యాఖ్యలు..
Rana Daggubati
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 8:33 PM

సినిమాను అభిమానల కోసం.. ప్రేక్షకుల చప్పట్ల కోసం చేస్తుంటాం.. ఆ చప్పట్ల మధ్యలో నిశ్శబ్దంగా కూర్చుని ఇది నిజమే కదా అని నమ్మి ఒకరు సినిమాను చూస్తుంటారు.. ఆ ఒక్కరి కోసమే ఈ సినిమా చేశానన్నారు రానా దగ్గుబాటి.. ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. ఇందులో కథానాయికగా సహజ నటి సాయి పల్లవి నటించగా.. ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించారు. నక్సలైట్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వరంగల్ లో విరాట పర్వం ఆత్మీయ వేడుకను నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా రానా మాట్లాడుతూ.. ” ఒక కథ ఒక మనిషిని మార్చుతుందా అంటే.. కచ్చితంగా మనం చేసే కథ మనల్ని మారుస్తుందని చెబుతాను.. చేసిన ప్రతీ పాత్రకు సంబంధించిన ఏదో ఒక అంశం నాలో ఉంది.. రవన్న పాత్ర కూడా నాలో పెద్ద భాగమైంది.. ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు ? అని.. ఏదైనా యాక్షన్ సినిమా చేయ్యె్చ్చు కాదా అని అడుగుతున్నారు… ఓ సినిమాను అభిమానల కోసం.. ప్రేక్షకుల చప్పట్ల కోసం చేస్తుంటాం.. కానీ ఆ చప్పట్ల మధ్యలో నిశ్శబ్ధంగా కూర్చుని ఇది నిజమే కదా అని నమ్మి ఒకరు సినిమాను చూస్తుంటారు.. వాళ్ల కోసం ఈ మూవీని చేశాను.. తెలంగాణలో కట్టెపుల్లను పట్టుకున్నా కవిత్వం వస్తుందన్నారు డైరెక్టర్ వేణు ఉడుగుల.. అది ముమ్మాటికి నిజమే.. ఇలాంటి కథలెన్నో మేం చెప్పాలనుకుంటున్నాం.. ఈ సినిమా జూన్ 17న మీ ముందుకు వస్తుంది.. మీ అందరి ప్రేమ కావాలి.. మళ్లీ సక్సెస్ మీట్ కు ఇక్కడికే వస్తాం” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి