Bitter Apple: చేల గట్ల మీద కనిపించే ఈ మొక్కను పిచ్చి మొక్క అనుకుంటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్

Bitter Apple Benefits:గ్రామాల్లో వాగులు, చేల గట్ల మీద పెరిగే వెర్రి పుచ్చ చెట్టు ఒకటి. ఇది ఒక తీగ..భూమి మీద పాకుతుంది. చిన్న దోసకాయ పరిమాణంలో పుచ్చకాయ రూపులో కనిపిస్తుంది.

Bitter Apple: చేల గట్ల మీద కనిపించే ఈ మొక్కను పిచ్చి మొక్క అనుకుంటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్
Veeri Puccha Or Bitter Appl
Follow us

|

Updated on: Jun 12, 2022 | 8:08 PM

Bitter Apple Benefits: మనం ఎందుకూ పనికిరావు.. పిచ్చి చెట్లు, కలుపు మొక్కలు అనుకునే ఎన్నో మొక్కల్లో ఔషధ గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. ఒకప్పుడు ఆయుర్వేదం బాగా ఉపయోగించే సమయంలో ప్రకృతిలో లభించే మొక్కలు, ఆకులు, తీగలు , కాయలు ఇలా వీటినే శారీరక వ్యాధుల నివారణకు ఉపయోగించేవారని తెలుస్తోంది. అయితే ఇలాంటి మొక్కల్లో ఒకటి గ్రామాల్లో వాగులు, చేల గట్ల మీద పెరిగే వెర్రి పుచ్చ చెట్టు ఒకటి. ఇది ఒక తీగ..భూమి మీద పాకుతుంది. చిన్న దోసకాయ పరిమాణంలో పుచ్చకాయ రూపులో కనిపిస్తుంది. అయితే ఈ చెట్టు.. శరీరంలోని వెయ్యి వ్యాధులను నివారిస్తుందని.. ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాలు కలిగి ఉందని చెబుతున్నారు. ఈ చెట్టుని సంస్కృతంలో ఇంద్ర‌వారుని, మ‌హేంద్ర‌వారుని అని.. హిందీలో ఇంద్రాయిన్ అని పిలుస్తారు. ఇక మన తెలుగులో ఈ కాయలు చేదుగా ఉంటాయి కనుక చేదు పుచ్చ,  పిచ్చి పుచ్చ అని పిలుస్తారు. ఈరోజు వెర్రి పుచ్చ చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెల్సుకుందాం..

*క‌డుపులోని మ‌లినాల‌ను, క‌ఫాన్ని, ఉద‌ర రోగాల‌ను నివారిస్తుంది.

పుండ్లతో ఇబ్బంది పడుతున్నవారు ఈ చెట్టు ఆకుల‌ను ఆముదంలో కానీ, నెయ్యిలో కానీ వేసి వేయించి వాటిపై ఆకుని పెట్టి కట్టుకట్టడం వలన పుండ్లు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

*తేలు కుడితే.. బాధితులు వెంటనే ఈ వెర్రి  పుచ్చ కాయ చిన్న ముక్క న‌మిలి తిన‌డం వలన నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.

*పిప్పి ప‌న్ను బాధపెడుతుంటే..  ఈ చెట్టు వేరు పొడిని కానీ, కాయ‌ల పొడిని కానీ కొంచెం తీసుకుని పిప్పి ప‌న్నుపై ఉంచాలి.

*రొమ్ములలో ఉండే గ‌డ్డ‌లు, నొప్పులు ఉన్నవారు వెర్రి పుచ్చ చెట్టు వేరును తీసుకుని శుభ్రంగా క‌డిగి ఆర‌బెట్టి ఎద్దు మూత్రంతో క‌లిపి అరగదీసి.. ఆ గంధాన్ని స్థ‌నాల‌పై అప్లై చేయాలి.. ఇలా చేయడం వలనా గడ్డలు కరిగిపోతాయి.

*  వెర్రి పుచ్చ చెట్టు వేరును, పిప్పిలిని, బెల్లాన్ని స‌మ‌పాళ్ల‌ల్లో క‌లిపి మెత్త‌గా నూరి ఆ పేస్ట్ ను పేను కొరుకుడుపై ప్లేస్లో రాస్తుంటే.. ఆ ప్రాంతంలో తిరిగి జుట్టు వస్తుంది.  అంతేకాదు జుట్టుని నల్లగా ఒత్తుగా మారుస్తుంది.

*వెర్రి పుచ్చ కాయ‌ గుజ్జును తీసుకుని మెత్త‌గా చేసి కొద్దిగా వేడి చేయాలి. దీనిని క‌డుపుపై ప‌రిచి ఊడిపోకుండా క‌ట్టు క‌ట్టాలి. ఇలా తరచుగా చేయడం వ‌ల్ల క‌డుపులోని పురుగులు అన్నీ మలం ద్వారా బ‌య‌ట‌కు పోతాయి.

అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఈ వెర్రి పుచ్చకాయకు రుచిలో చేదుగా ఉంటుంది. అమిత‌మైన వేడిని క‌ల‌గ‌జేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది. కనుక ఎక్కువగా తీసుకోవడం వలన విరేచ‌నాలు అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. (సోర్స్)

(ఇక్కడ ఇచ్చిన సమాచారం.. అవగాహన కోసమే.. ఈ చెట్టుని ఉపయోగించే ముందు ఆరోగ్య నిపుణులను లేదా వైద్యులను సంప్రదించి ఉపయోగించాల్సి ఉంటుంది. )

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..