Basha Shek |
Updated on: Jun 13, 2022 | 9:12 AM
కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు హెన్రిచ్ క్లాసెన్ (81 పరుగులు) అద్భుత అర్ధసెంచరీతో ఆదివారం జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
టీమ్‌ఇండియా బౌలర్లు రాణించినా క్లాసెన్‌ను తొందరగా ఔట్ చేయలేకపోయారు. క్లాసెన్ 7 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 81 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ బవుమా, డేవిడ్ మిల్లర్‌తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాల్ని నెలకొల్పాడు. దీంతో టీమిండియాకు మరో ఓటమి తప్పలేదు.
కాగా భారత్ ఓటమికి బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఓ కారణం. చివరి ఓవర్లలో భారీగా పరుగుల చేయాల్సిన సమయంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దినేష్ కార్తీక్ స్థానంలో అక్షర్ పటేల్‌ను పంపారు. అక్షర్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్ 21 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అతను ఇంకాస్త ముందు వచ్చి ఉంటే టీమిండియా మరిన్ని పరుగులు సాధించి ఉండేది
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. తొలి టీ20లా భారత బ్యాటర్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. పిచ్ కూడా టీమిండియాకు సహకరించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. జట్టు ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ బాగానే ఆరంభించాడు కానీ ఆ తర్వాత తన జోరును కోల్పోయాడు. జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు
మొదటి మ్యాచ్‌లో బౌలర్లు ఫెయిల్ కాగా.. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు తేలిపోయారు. ఫలితంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 2-0 తేడాతో వెనకబడింది.