AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs SA: భారత్‌కు తప్పని ఓటమి.. 4 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా..

దక్షిణాఫ్రికాతో జగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఆదివారం కటక్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది...

IND Vs SA: భారత్‌కు తప్పని ఓటమి.. 4 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా..
IND Vs SA
Srinivas Chekkilla
|

Updated on: Jun 12, 2022 | 11:05 PM

Share

దక్షిణాఫ్రికాతో జగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఆదివారం కటక్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఓపెనర్​ రుజురాజ్​ గైక్వాడ్​ ఒక్క పరుగు చేసి వెనుతిరగా.. ఇషాన్​ కిషన్​ 21 బంతుల్లో 34 చేసి పెవిలియన్ చేరాడు. శ్రేయస్​ అయ్యర్ 40(35), దినేశ్​ కార్తిక్​ 30(21) మినహా ఇతర ఆటగాళ్లు చాలా స్వల్ప స్కోరు చేసి వెనుదిరిగారు.

లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. హెన్రిచ్‌ క్లాసెన్ 81, తెంబా బవుమా 35 రాణించారు. దక్షిణాఫ్రికా మిగతా బ్యాటర్లలో హెండ్రిక్స్‌ (4), ప్రిటోరియస్ (4), డసెస్‌ (1), పార్నెల్‌ (1) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. డేవిడ్ మిల్లర్‌ (20), రబాడ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హర్షల్‌ పటేల్, చాహల్‌ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దక్షిణాఫ్రికా దూసుకెళ్లింది. వైజాగ్‌ వేదికగా మంగళవారం మూడో టీ20 జరగనుంది.

Follow Us
నల్ల బంగారం.. అనారోగ్య సమస్యలన్నీ పరార్..
నల్ల బంగారం.. అనారోగ్య సమస్యలన్నీ పరార్..
సెప్టెంబర్‌లో వారికి కెరీర్, వ్యాపారంలో భారీ లాభాలు!
సెప్టెంబర్‌లో వారికి కెరీర్, వ్యాపారంలో భారీ లాభాలు!
మనసులో ద్వేషానికి తాతయ్య చెప్పిన గుణపాఠం.. కుళ్లిన బంగాళాదుంపల కథ
మనసులో ద్వేషానికి తాతయ్య చెప్పిన గుణపాఠం.. కుళ్లిన బంగాళాదుంపల కథ
'చేతులతో కోటనే కదిలించారు' జపాన్‌లో భవనాన్ని జరిపిన ప్రజలు
'చేతులతో కోటనే కదిలించారు' జపాన్‌లో భవనాన్ని జరిపిన ప్రజలు
మీ కరెంట్ బిల్లు తప్పుగా వచ్చిందనే అనుమానం ఉందా..? ఈ సింపుల్..
మీ కరెంట్ బిల్లు తప్పుగా వచ్చిందనే అనుమానం ఉందా..? ఈ సింపుల్..
ప్రకృతిలో విరబూసిన రాఖీ.. ఈ ఫ్లవర్ స్పెషల్ ఇదే..
ప్రకృతిలో విరబూసిన రాఖీ.. ఈ ఫ్లవర్ స్పెషల్ ఇదే..
మరో 2రోజుల్లో NEET PG 2026 ఆన్‌లైన్ పరీక్ష.. అడ్మిట్ కార్డు లింక్
మరో 2రోజుల్లో NEET PG 2026 ఆన్‌లైన్ పరీక్ష.. అడ్మిట్ కార్డు లింక్
చెక్‌బుక్ పోతే ఏం చేయాలి..? ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ..
చెక్‌బుక్ పోతే ఏం చేయాలి..? ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ..
వినూత్నంగా రక్షాబంధన్ వేడుక.. గొప్ప సందేశం ఇచ్చిన విద్యార్ధులు!
వినూత్నంగా రక్షాబంధన్ వేడుక.. గొప్ప సందేశం ఇచ్చిన విద్యార్ధులు!
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే.
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే.