Love Murder: ఇంత కిరాతకమా? విందు ఇస్తానని పిలిచి చెల్లిని, బావను క్రూరంగా చంపిన అన్న..!

Love Murder: వేరే కులానికి చెందిన వ్యక్తి పెళ్లాడిందనే ఆగ్రహంతో చెల్లెలితో పాటు ఆమె భర్తను నరికేశాడో అన్న. తమిళనాడులో జరిగిన ఈ పరువుహత్య దేశ వ్యాప్తంగా

Love Murder: ఇంత కిరాతకమా? విందు ఇస్తానని పిలిచి చెల్లిని, బావను క్రూరంగా చంపిన అన్న..!
Crime
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 14, 2022 | 6:03 AM

Love Murder: వేరే కులానికి చెందిన వ్యక్తి పెళ్లాడిందనే ఆగ్రహంతో చెల్లెలితో పాటు ఆమె భర్తను నరికేశాడో అన్న. తమిళనాడులో జరిగిన ఈ పరువుహత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. తమిళనాడు తంజావూరు జిల్లాలో జరిగిన దారుణం ఇంది. పెళ్లై నాలుగు రోజులు కూడా కాలేదు. అంతలోనే దారుణ హత్యకు గురయ్యారు ఈ నవ దంపతులు. స్వయాన నవ వధువు అన్న, ఆమె బావ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడమే ఈ నవ దంపతులు చేసిన నేరమైపోయింది.

వివరాల్లోకెళితే.. తంజావూరుకు చెందిన తంజావూర్ కి చెందిన శరణ్య, తిరువణ్ణామలై కి చెందిన మోహన్ కొంత కాలం నుంచి ప్రేమించుకున్నారు..వేరు కులాలకు చెందినవారు కావడంతో ఇరు వైపులా కుటుంబ సభ్యులు వీరి వివాహానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో శరణ్య, మోహన్‌ విధిలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో కొత్త దంపతులు పోలీసులను ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు శరణ్యతో పాటు మోహన్‌ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. తొలుత ఆగ్రహం వ్యక్తం చేసినా, పోలీసులు నచ్చజెప్పడంతో వీరి పెళ్లికి ఇరువైపులా అంగీకారం తెలిపారు. మోహన్‌తో పెళ్లికి అంగీకారం తెలిపిన శరణ్య అన్న శక్తివేల్, కొత్త దంపతులను విందు ఇస్తానంటూ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. ప్రేమజంట వీరిని నమ్మి విందు కోసం వెళ్లారు. శక్తివేల్‌ తన చెల్లెలు శరణ్యతో పాటు మోహన్‌ మీద దాడి చేసి నరికి చంపేశాడు. ఈ హత్యలో శరణ్య బావ రంజిత్ కూడా సహకరించాడు. పోలీసులు శక్తివేల్‌, రంజిత్‌లను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.