Viral Video: పిల్లి లా మారిపోయిన పెద్ద పులి.. పీపాలు పీపాలు పాలే తాగేస్తోంది.. బ్యూటీఫుల్ వీడియో మీకోసం..!

Viral Video: పులి పేరు ఎత్తగానే.. అమ్మో అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. అది క్రూర మృగాల్లో ఒకటి. సింహం తరువాత అత్యంత శక్తివంతమైన,

Viral Video: పిల్లి లా మారిపోయిన పెద్ద పులి.. పీపాలు పీపాలు పాలే తాగేస్తోంది.. బ్యూటీఫుల్ వీడియో మీకోసం..!
Tiger
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 11, 2022 | 7:40 AM

Viral Video: పులి పేరు ఎత్తగానే.. అమ్మో అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. అది క్రూర మృగాల్లో ఒకటి. సింహం తరువాత అత్యంత శక్తివంతమైన, అత్యంత క్రూరమైన జంతువు పులి. దానికి చిక్కామో.. ఇక ఆహారం అవ్వాల్సిందే. అంతటి భయంకరమైనది కాబట్టే.. పులి అంటే అందరూ జడుసుకుంటారు. కొందరికి ఇది మినహాయింపు. కొందరు వ్యక్తులు పులులు, సింహాలతో స్నేహం చేస్తారు. వారికి ఆ టెక్నిక్స్ బాగా తెలుసు కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. అది వేరే విషయం. సాధారణంగా పులి మాంసాహారి. తన ఆకలిని తీర్చుకోవడం కోసం ఏదో ఒక జంతువును వేటాడి తింటుంది. పచ్చి నెత్తురు తాగేస్తుంది. అలాంటి క్రూరమైన మాంసాహారి అయిన పులి.. శాకాహారిలా, ఒక పిల్లి మాదిరిగా పాలు తాగడం ఎప్పుడైనా చూశారా? పోనీ కనీసం విన్నారా? ఈ రెండు జరుగకపోతే ఇప్పుడు వీడియోలో చూసేయండి. ఈ వీడియోలో పులి.. పీపాలు పీపాలు పాలను తాగేస్తుంది. చూడటగానికి ఎంతో అందంగా, క్యూట్‌గా ఉన్న ఈ పులికి.. ఓ కేర్ టేకర్ పాల డబ్బాతో పాలు పట్టిస్తోంది.

వాస్తవానికి తెల్లరంగులో ఉన్న ఈ పులి సంరక్షణ కేంద్రంలో సంరక్షించబడుతోంది. అయితే, ఈ పులికి ఓ మహిళ.. సీసాలో పాలు తాగిపిస్తోంది. ఈ క్యూట్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రమ్‌లో Discover.animal అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చూడ ముచ్చటగా ఉన్న ఆ పులిని చూసి మురిసిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 7.63 లక్షల వ్యూస్ రాగా, 60 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.