Paytm Charges: వినియోగదారులకు సైలెంట్‌గా షాక్ ఇస్తున్న Paytm.. మొబైల్ రీచార్జ్‌లపై అదనపు ఛార్జీలు వసూలు..!
Paytm Charges: ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం వినియోగదారులపై యూజర్ ఛార్జీలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వినియోగదారులు చెబుతున్నారు.
Paytm Charges: ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం వినియోగదారులపై యూజర్ ఛార్జీలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వినియోగదారులు చెబుతున్నారు. మొబైల్ రీఛార్జ్‌లపై ప్రాసెసింగ్ ఫీజు పేరుతో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలువురు యూజర్లు చెబుతున్నారు. రీఛార్జ్ అమౌంట్‌ను బట్టి ఆ ఫీజు ఉంటుందంటున్నారు. వినియోగదారుల సమాచారం ప్రకారం రూ. 1 నుంచి రూ. 6 మధ్య సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. యూపీఐ, బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే మొబైల్ ఛార్జీలపై ఈ రుసుము వసూలు చేయడం జరుగుతుంది. అయితే, ఇది వినియోగదారులందరికీ వర్తించడం లేదని, కానీ, రానున్న రోజులు ఇది పూర్తి స్థాయిలో అమలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి రూ. 100 అంతకంటే ఎక్కువ రీచార్జ్‌లపై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు పలువురు వినియోగదారుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇదే విషయాన్ని గ్యాడ్జెట్ 360 నివేదించింది.
అయితే, 2019లో Paytm తన వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం వేయబోమని పేర్కొన్నారు. వారు చేసే ట్రాన్సాక్షన్స్‌పై అధిక ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది పేటీఎం. అయితే, మరింత ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో పేటీఎం వ్యూహాలు కూడా మారుతున్నట్లు తాజా పరిణామాలు తెలుపుతున్నాయి.
Important: Paytm neither charges nor will charge any convenience or transaction fee from customers on using any payment method which includes Cards, UPI and Wallet. Read our blog for more. ⬇️ https://t.co/rfPp21MAx1
— Paytm (@Paytm) July 1, 2019
ఇక మరో పేమెంట్స్ యాప్ PhonePe కూడా గత ఏడాది అక్టోబర్ నెల నుంచి రూ 50 కంటే ఎక్కువ మొత్తంలో చేసే మొబైల్ రీఛార్జ్‌లపై ‘ప్రాసెసింగ్ ఫీజు’ను వసూలు చేస్తోంది. ఇది వినియోగదారులను బాగా ప్రభావితం చేసింది. ఫోన్ పే అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో.. వినియోగదారులు ఇతర పేమెంట్స్ యాప్స్ వైపు దృష్టి మరల్చారు. గూగుల్ పే, అమేజాన్ పే వంటి పేమెంట్స్ యాప్స్ చిన్న చిన్న లావాదేవీలపై ఎలాంటి ప్రత్యేక రుసుములు వసూలు చేయకపోవడంతో.. యూజర్లు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇక దేశంలోని ప్రధాన టెలికాం సంస్థలు అయిన ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కూడా తమ స్వంత యూప్‌ల ద్వారా రీచార్జ్‌లకు అనుమతి ఇస్తున్నాయి. దాంతో వినియోగదారులు ఎక్కువ డబ్బులు వసూలు చేసే యాప్స్‌కు గుడ్ బై చెబుతున్నారు.