AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: డిస్ట్రబ్ చేస్తున్నారని నడిరోడ్డుపై ధర్నాకు దిగిన పిల్ల ఏనుగు.. పైకి లేరా అయ్యా అంటూ బతిమిలాడిన తల్లి ఏనుగు..!

Funny Video: పిల్లలు అలగడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. తమకు నచ్చిన వస్తువులు కావాలనో, నచ్చిన ఫుడ్ ఇప్పించాలనో..

Funny Video: డిస్ట్రబ్ చేస్తున్నారని నడిరోడ్డుపై ధర్నాకు దిగిన పిల్ల ఏనుగు.. పైకి లేరా అయ్యా అంటూ బతిమిలాడిన తల్లి ఏనుగు..!
Elephant
Shiva Prajapati
|

Updated on: Jun 10, 2022 | 5:10 PM

Share

Funny Video: పిల్లలు అలగడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. తమకు నచ్చిన వస్తువులు కావాలనో, నచ్చిన ఫుడ్ ఇప్పించాలనో మారాం చేస్తుంటారు. వారి కోరికను కాదంటే చాలు.. నానా యాగీ చేస్తుంటారు. రోడ్డుపైనే పడుకుని రచ్చ రచ్చ చేస్తుంటారు. ఎందుకంటే పిల్లల మనస్తత్వం అలాంటిది. ఏమీ తెలియని పసితనం చేత వారు అలా ప్రవర్తిస్తుంటారు. అయితే, మనుషుల తెలివి తేటలు అలాంటివి కాబట్టి.. వారు మారాం చేయడం మనకు కొత్తగా ఏమీ అనిపించదు. మరి జంతువులు మారాం చేయడం, అలిగి రోడ్డుపై పడుకుని రచ్చ చేయడం ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు చూసేయండి. జంతువులుల్లో ఏనుగులు కాస్త తెలివైన జంతువులు అని చెప్పొచ్చు. ఆ తెలివి కారణంగానే.. అవి చేసే పనులు మనుషులను బాగా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా పిల్ల ఏనుగులు చేసే అల్లరి అంతా ఇంతా ఉండదు. తాజాగా ఓ ఏనుగులు పిల్ల అలిగిన విధానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఈ వీడియోలో అటవీ ప్రాంతం గుండా వేసిన రహదారిపైకి ఓ పిల్ల ఏనుగు సడెన్‌గా వచ్చింది. బాగా అలిగినట్లుంది.. నడి రోడ్డుపైనే పడుకుండిపోయింది. ఆ వెంటనే మందకు మంద ఏనుగులు వచ్చి.. అలిగిన గున్న ఏనుగును పైకి లేపేందుకు తీవ్రంగా శ్రమించాయి. పైకి లేరా అయ్యా అంటూ ప్రతీ ఏనుగు దానిని బతిమిడాయి. అయినా తగ్గేదే లే అంటూ.. రోడ్డుపైనే మారాం చేసింది ఆ పిల్ల ఏనుగు. ఇక దీంతో లాభం లేదనుకుని కొన్ని ఏనుగులు వెళ్లిపోగా.. తల్లి ఏనుగు, మరో సోదర ఏనుగు మాత్రం అది లేచేంత వరకు ప్రయత్నించాయి. ఇకా చాల్లే అనుకుందో ఏమో గానీ.. చివరకు పైకి లేచి తల్లి ఏనుగుతో కలిసి బయలుదేరింది. అయితే, పిల్ల ఏనుగు రోడ్డుపై అలకపాన్పు వేయడంతో రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు ఈ బ్యూటిఫుల్ దృశ్యాన్ని తమ ఫోన్ కెమెరాల్లో రికార్డ్ చేశారు. ఆ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాజ్ గౌడ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే వేలాది వ్యూస్ వచ్చాయి. అల్లరి ఏనుగు పిల్ల చేసిన తుంటరి పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..