Andhra Pradesh: 10 గంటల్లోనే 11,500 లీటర్ల డీజిల్ మాయం.. ఆ డిపోలో రచ్చ రచ్చ..

Andhra Padesh: ఒకటి కాదు.. రెండు కాదు.. 11,500 లీటర్ల డీజిల్‌ మాయమవడం ఆర్టీసీ వర్గాల్లో చర్చకుదారితీసింది. తుని ఆర్టీసీ డిపోలో డీజిల్‌ మాయం

Andhra Pradesh: 10 గంటల్లోనే 11,500 లీటర్ల డీజిల్ మాయం.. ఆ డిపోలో రచ్చ రచ్చ..
Diesel
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 10, 2022 | 9:38 AM

Andhra Padesh: ఒకటి కాదు.. రెండు కాదు.. 11,500 లీటర్ల డీజిల్‌ మాయమవడం ఆర్టీసీ వర్గాల్లో చర్చకుదారితీసింది. తుని ఆర్టీసీ డిపోలో డీజిల్‌ మాయం ఇప్పుడు కలకలం రేపుతోంది. రెండు రోజుల కిందటే డీజిల్‌ తగ్గడం గుర్తించారు. కానీ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు బయటకు తెలియడంతో విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేశారు.

తుని డిపోలో 20 వేల లీటర్ల కెపాసిటీతో రెండు స్టోరేజ్‌ ట్యాంకులు ఉన్నాయి. ఒక ట్యాంకులో సుమారు 11 వేల 500 లీటర్ల ఆయిల్‌ మాయమైంది. కేవలం 10 గంటల టైమ్‌లో ఇన్ని వేల లీటర్ల డీజిల్‌ ఎలా తగ్గింది? అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. మాయమైన డీజిల్‌ వల్ల సుమారు 11 లక్షల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు అధికారులు.

తుని డిపోలో 67 బస్సులు ఉన్నాయి. రోజుకు 5 వేల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తారు. నాలుగు నుంచి ఆరు రోజుల వరకు ఆయిల్‌ను స్టోరేజ్‌ ట్యాంకర్లలో నిల్వ చేస్తారు. పాయకరావుపేటలో ఓ ఒంకు నుంచి ఆయిల్‌ డిపోకు వస్తోంది. ప్రతిరోజు రాత్రి క్లోజింగ్‌ స్టాక్‌, ఉదయం ఓపెనింగ్‌ స్టాక్‌ పరిశీలిస్తారు. మంగళవారం ఉదయం స్టాక్‌ పరిశీలించినపుడు ఒక ట్యాంకులో 11వేల 500 లీటర్ల తేడా వచ్చింది. 2003లో ఈ స్టోరేజ్‌ ట్యాంకర్‌ను పెట్టారు. ఒక్కసారిగా లీక్‌ కావడంతో మిగిలిన ఆయిల్‌ను బయటకు తీసి డ్రమ్ముల్లో నింపారు.

వేలాది లీటర్ల డీజిల్ ఉన్నపళంగా కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆవిరైపోయిందా.. ఎవరైనా ఎక్కడికైనా దొంగచాటుగా తరలించారా..? అనేది అంతుబట్టడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆర్టీసీ విజిలెన్స్‌ టీమ్‌ విచారణ చేపట్టింది. జిల్లా ట్రాన్స్‌ఫోర్టు ఆఫీసర్‌ శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎంఈ జీవన్‌, సుధాకర్‌, విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ దుర్గాప్రసాద్‌తో కూడిన కమిటీ డిపోలో వివరాలు సేకరించింది. డిపో మేనేజర్‌ కిరణ్‌కుమార్‌, మెకానికల్‌ ఫోర్‌మెన్‌ నుంచి వివరాలు తెలుసుకున్నారు.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.