Chiranjeevi: మహేశ్‌ను చూస్తోంటే గర్వంగా ఉంది.. మేజర్ సినిమాపై మెగాస్టార్‌ ప్రశంసలు.. చెవి పోగులతో చిరు లుక్‌ వైరల్‌..

Major Movie: 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో అమరులైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్‌ (Major). యంగ్‌ హీరో అడివి శేష్‌ (Adivisesh) శాండీ సార్‌ పాత్రలో నటించాడు. సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించగా..

Chiranjeevi: మహేశ్‌ను చూస్తోంటే గర్వంగా ఉంది.. మేజర్ సినిమాపై మెగాస్టార్‌ ప్రశంసలు.. చెవి పోగులతో చిరు లుక్‌ వైరల్‌..
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Jun 14, 2022 | 6:39 AM

Major Movie: 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో అమరులైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్‌ (Major). యంగ్‌ హీరో అడివి శేష్‌ (Adivisesh) శాండీ సార్‌ పాత్రలో నటించాడు. సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించగా.. తెలుగమ్మాయి శోభిత ధూళిపాత, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి ప్రధాన పాత్రల్లో నటించారు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించాడు. సోనీ పిక్చర్స్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్షన్స్‌ బ్యానర్‌పై, హీరో మ‌హేశ్‌బాబు (Mahesh Babu) జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జూన్ 3న తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. రికార్డు స్థాయి వసూళ్లతో పాటు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు ఈ చిత్రానికి వస్తున్నాయి. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా చూపించారని.. అడివి శేష్ నటన అద్భుతమంటూ ప్రేక్షకులే కాకుండా.. సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) మేజర్ చిత్రయూనిట్ ను అభినందించారు.

చెవి పోగులతో మెగాస్టార్‌..

ఇవి కూడా చదవండి

మేజర్‌ చిత్రబృందంతో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్‌ చేసిన చిరంజీవి..’మేజర్‌ ఒక సినిమా మాత్రమే కాదు. అదొక ఎమోషన్‌. అమరవీరుడు మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని హత్తుకునేలా సినిమాను తెరకెక్కించారు. ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటి మూవీని మహేశ్‌బాబు నిర్మించినందుకు ఎంతో గర్వంగా ఉంది. మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్‌’ అని విషెస్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. చిరంజీవి మంచి సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారని, ఇటీవల విక్రమ్‌ సినిమా చిత్రబృందాన్ని కూడా సత్కరించారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ ఫొటోల్లో మెగాస్టార్‌ చెవి పోగులతో కనిపించడం విశేషం. దీంతో ఇది ఏ సినిమాలోని లుక్‌ అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు ఫ్యాన్స్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేటి పౌర్ణమి గరుడ సేవ రద్దు.. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం

Saliva: నోటిలో లాలాజలం ఎక్కువగా రావడానికి ఇవే కారణాలు ఇవే.. ఉపశమనం పొందడానికి చిట్కాలు

AP & Telangana Weatehr Report: ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి వర్ష మేఘాలు.. తొకరితో పులకరించిన పలు ప్రాంతాలు..!

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?