AP & Telangana Weather Report: ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి వర్ష మేఘాలు.. తొలకరితో పులకరించిన పలు ప్రాంతాలు..!

AP & Telangana Weatehr Report: తొలకరి పిలుపు వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. మాన్‌సూన్‌ రాకతో ఏపీ, తెలంగాణలో..

AP & Telangana Weather Report: ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి వర్ష మేఘాలు.. తొలకరితో పులకరించిన పలు ప్రాంతాలు..!
Ap Weather Alert
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Jun 14, 2022 | 6:51 AM

AP & Telangana Weather Report: తొలకరి పిలుపు వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. మాన్‌సూన్‌ రాకతో ఏపీ, తెలంగాణలో తొలకరి వర్షాలు మొదలైపోయాయి. రెండు మూడు రోజుల్లో తెలుగు స్టేట్స్‌ మొత్తం జోరువానలు దంచికొట్టబోతున్నాయ్‌. కాస్త లేట్ అయినా, మరింత ఆలస్యం లేకుండా తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాయ్‌ నైరుతి రుతుపవనాలు. రావడం రావడమే వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. మాన్‌సూన్‌ మబ్బులతో సూర్యుడ్ని కమ్మేసి, వెదర్‌ను ఆహ్లాదకరంగా చేసేశాయ్ నైరుతి రుతుపవనాలు.

అయితే, గడువు కంటే ముందే మాన్‌సూన్‌ దేశంలోకి ఎంట్రీ ఇచ్చినా, విస్తరించేందుకు మాత్రం టైమ్‌ తీసుకున్నాయ్‌. మే 15 నాటికే మాన్‌సూన్‌ అండమాన్‌ను తాకింది. కానీ, మందగమనంతో అక్కడే ఆగిపోయాయి. IMD లెక్క ప్రకారం జూన్‌ ఫస్ట్‌ వీక్‌లోనే ఏపీ, తెలంగాణలోకి నైరుతి వర్ష మేఘాలు ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా, వారం పది రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి.

ఇక నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ఏపీ, తెలంగాణలో నైరుతి మబ్బులు కమ్మేశాయి. అనేక ప్రాంతాల్లో తొలకరి జల్లులు సైతం కురిశాయి. దాంతో, వేసవి వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు జనం. మాన్‌సూన్‌ ప్రభావంతో తెలంగాణ అంతటా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మూడ్రోజులపాటు జోరువానలు పడతాయని తెలిపింది. ప్రజెంట్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా వరకు విస్తరించిన నైరుతి వర్ష మేఘాలు, ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయ్‌.

ఇవి కూడా చదవండి

ఏపీలో రాయలసీమతోపాటు కోస్తాంధ్రలో నైరుతి మేఘాలు విస్తరించాయ్‌. దాంతో, రాబోయే మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఐదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించి, ఉరుములు మెరుపులతో హెవీ రెయిన్స్‌ పడతాయంటున్నారు అధికారులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా, పూర్తిగా విస్తరించడానికి మూడు నాలుగు రోజులు పడుతుందంటున్నారు. అయితే, మాన్‌సూన్‌తోపాటు ఉపరితల ద్రోణి కూడా ఆవరించి ఉండటంతో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో జోరుగా గాలివానలు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.