Hyderabad Gangrape: ‘‘పాపం.. వారిదంటే వారిది’’.. జూబ్లీహిల్స్ రేప్ కేసులో సంచలన విషయాలు..
పబ్‌లో అమ్మాయిల కోసం వెదికింది అతనే.. వేధించింది అతనేనన్నాడు. వద్దని చెప్పిన తనకు ఎమ్మెల్యే కొడుకు వార్నింగ్ ఇచ్చినట్టు పోలీసులకు చెప్పాడు సాదుద్దీన్. వాళ్ల ప్రొద్బలం మేరకే తనూ అఘాయిత్యం చేయాల్సి వచ్చిందనేది సాదుద్దీన్ వెర్షన్..
Hyderabad Gangrape Case: జూబ్లీహిల్స్ రేప్ కేసు విచారణలో షాకింగ్ ఎలిమెంట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాదుద్దీన్ సహా ఐదుగురు సీసీఎల్స్ కస్టడీ గడవు ముగిసింది. కస్టడీ రిపోర్ట్‌లో సంచలనాలు వెలుగుచూశాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కథ, స్క్రీన్‌ప్లే అంతా శాస్త్రిపురం కార్పొరేటర్ కొడుకుదేనని సాదుద్దీన్ విచారణలో వివరించాడు. పబ్‌లో అమ్మాయిల కోసం వెదికింది అతనే.. వేధించింది అతనేనన్నాడు. వద్దని చెప్పిన తనకు ఎమ్మెల్యే కొడుకు వార్నింగ్ ఇచ్చినట్టు పోలీసులకు చెప్పాడు సాదుద్దీన్. వాళ్ల ప్రొద్బలం మేరకే తనూ అఘాయిత్యం చేయాల్సి వచ్చిందనేది సాదుద్దీన్ వెర్షన్ .
అయితే.. అటు ఆ ఐదుగురు సీసీఎల్స్ మూడు రోజుల కస్టడీలో డ్రామాను రక్తి కట్టించారు. అంతా అతనే చేశాడంటూ సాదుద్దీన్‌పై నేపం మోపారు. అమ్నేషియా పబ్ నుంచి బయటకు వచ్చాక ఎటు వెళ్లారు? ఎందుకు? కారులో ఏం చేశారు? ఇలా పిన్‌పాయింట్‌గా వాళ్ల నుంచి నిజాలను రాబట్టారు పోలీసులు.
ఆమ్నేషియా పబ్‌లోనే అమ్మాయిపై నిందితుల కన్ను పడింది. డ్రాప్ చేస్తామంటూ అమ్మాయిని ట్రాప్ చేసి కారులో ఎక్కించుకున్నారు. రన్నింగ్ కారులోనే రేప్‌కు పాల్పడినట్టు విచారణలో తేలింది. సాదుద్దీన్ రెచ్చగొడితేనే రేప్ చేశామని మైనర్లు చెప్తుంటే.. వాళ్లు ఒత్తిడి చేస్తేనే అఘాయిత్యానికి పాల్పడ్డానని సాదుద్దీన్ చెప్పినట్టు సమాచారం.
ఒకర్ని బద్నాం చేయాలని ఒకరు ప్రయత్నించినా చివరకు.. ఇద్దరు చెప్పిన విషయాలు సరిపోలాయి. ఇక ఏ1 టు A6 ఫ్రేమ్‌లో ఎవరి పేర్లు ముందుంటాయి? నెక్ట్స్ ఏం జరుగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. గడువు ముగియడంతో సాదుద్దీన్‌ను చంచల్‌గూడ జైలుకు.. ఐదుగురు సీసీఎల్స్‌ను జువనైల్ హోమ్‌కు పోలీసులు తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..