Telangana: తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్.. రేపటినుంచి వర్షాలే వర్షాలు..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు మహబూబ్‌నగర్ జిల్లా వరకు విస్తరించినట్లు వాతవరణశాఖ తెలిపింది.
Telangana Weather Forecast: ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయి. దీంతో రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు మహబూబ్‌నగర్ జిల్లా వరకు విస్తరించినట్లు వాతవరణశాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో తెలంగాణలోని మరి కొన్ని జిల్లాలకు, ఆ తదుపరి 2 రోజుల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు కింది స్థాయి గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రము వైపునకు వీస్తున్నట్లు పేర్కొంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు..
ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షములు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
నైరుతి రుతుపవనాలు విస్తరించిన ప్రాంతాలు..
నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, కొంకణ్, మహారాష్ట్ర, మరాఠ్వాడా, కర్ణాటకలోని చాలా ప్రాంతాలు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని భాగాలు, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలకు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..