Bramhastra: బ్రహ్మస్త్ర సినిమా ట్రైలర్‌కు వాయిస్ అందించిన మెగాస్టార్.. వీడియో షేర్ చేసిన జక్కన్న..
ఈ చిత్రానికి డైరెక్టర్ అయాన్మ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ , స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మస్త్ర (Brahmāstra). ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలలో నటించగా.. అమితాబ్, నాగార్జున అక్కినేని కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి డైరెక్టర్ అయాన్మ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ , స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను 2022 సెప్టెంబర్ 9న హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది చిత్రయూనిట్. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో మొదటి పార్ట్ శివ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా బ్రహ్మస్త్ర సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అసోసియేట్ అవుతారనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ఈ వార్తలను నిజం చేస్తూ బ్రహ్మస్త్ర తెలుగు ట్రైలర్‌కు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు.. అందులో బ్రహ్మస్త్ర తెలుగు ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ అందిస్తున్నారు చిరంజీవి.. ఈ ప్రోమోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ..బ్రహ్మస్త్ర సినిమాతో చిరంజీవి అసోసియేట్ కావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు జక్కన్న. బ్రహ్మస్త్ర సినిమాను దక్షిణాదిలో విడుదల చేయడానికి రాజమౌళితో అసోసియేట్ అయ్యింది చిత్రయూనిట్. జూలై 15న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
Happy to announce that @KChiruTweets garu has lent his voice to Brahmāstra Trailer.
Telugu Trailer of Brahmāstra will release on June 15th!https://t.co/Rl70nZkaMR
— rajamouli ss (@ssrajamouli) June 13, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.