RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ పాటకు ఫిదా అయిన క్యాప్‌ జెమినీ చైర్మన్‌.. ఫ్రెండ్స్‌కు ఎలాంటి ఛాలెంజ్‌ విసిరారంటే..

Naacho Naacho Challenge: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan), యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) హీరోలుగా నటించారు. ఈ ఏడాది మార్చి25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈచిత్రం..

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ పాటకు ఫిదా అయిన క్యాప్‌ జెమినీ చైర్మన్‌.. ఫ్రెండ్స్‌కు ఎలాంటి ఛాలెంజ్‌ విసిరారంటే..
Capgemini Chairman
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 8:32 PM

Naacho Naacho Challenge: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan), యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) హీరోలుగా నటించారు. ఈ ఏడాది మార్చి25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. వరల్డ్‌ వైడ్‌గా వేయి కోట్ల మేర కలెక్షన్లు రాబట్టి ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ చిత్రంలోని పాటలు, పోరాట దృశ్యాలు ఓ రేంజ్‌లో హిట్‌ అయ్యాయి. ముఖ్యంగా నాటు నాటు సాంగ్‌లో చెర్రీ, తారక్‌లు వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇన్‌స్టారీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌ రూపంలో చాలామంది ఈ పాటను రీక్రియేట్‌ చేసి ఆకట్టుకున్నారు. విదేశాల్లోనూ చాలామంది ఈ పాటకు అద్భుతంగా కాలు కదిపి.. ఆ వీడియోలను షేర్‌ చేశారు. కాగా ఇప్పుడు ఇదే పాటపై ఓ ఛాలెంజ్‌ విసిరారు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం కంపెనీ క్యాప్‌ జెమినీ చైర్మన్‌ పాల్‌ హెర్మెలిన్‌.

మీ డ్యాన్స్ వీడియోలను పంపండి..

ఇవి కూడా చదవండి

బిజినెస్‌ పనుల కోసం భారతదేశానికి వచ్చిన హెర్మెలిన్‌.. స్నేహితుల సలహాల మేరకు నాటు నాటు హిందీ వెర్షన్‌ సాంగ్‌ను చూశారు. వెంటనే ఆ పాటకు, అందులో హీరోలు వేసిన స్టెప్పులకు ఫిదా అయిపోయారు. అనంతరం ఇండియాలోని తన స్నేహితులకు ఇదే పాటపై ఛాలెంజ్‌ విసిరారు. ‘రెండేళ్ల తర్వాత ఇండియాకు వచ్చాను.. మూడు రోజులపాటు బిజినెస్‌ పనులు ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమయ్యాను. అప్పుడే ఇటీవల విడుదలైన భారతీయ చిత్రాల్లోని ఏదైనా సూపర్‌ హిట్‌ సాంగ్‌ వినాలనుకున్నప్పుడు నా స్నేహితుడు ఇచ్చిన సూచనతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాచో నాచో’ (హిందీ వెర్షన్) వీడియో సాంగ్‌ను చూశా. కొన్ని రోజుల క్రితం వరకు ఇది కేవలం ఒక పాట మాత్రమే. ఇప్పుడు ఒక ఆచారం, ఉత్సవంలా మారిపోయింది. ఈ పాటకు మీరూ డ్యాన్స్‌ చేయగలరా? నా భారతీయ స్నేహితులందరి ఈ వారం వీడియోలను ఆహ్వానిస్తున్నాను’ అని లింక్డ్‌ ఇన్‌ వేదికగా సవాల్‌ విసిరారు పాల్‌ హెర్మెలిన్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

IND vs SA: మా తుజే సలాం పాటతో మార్మోగిన క్రికెట్‌ మైదానం.. నెట్టింట్లో రోమాలు నిక్కబొడుచుకునే వీడియో..

World Blood Donor Day 2022: రక్తదానం చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

IND vs SA: కటక్‌లో టీమిండియా ఓటమికి కారణాలివే.. కొంపముంచిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పులు..