World Blood Donor Day 2022: రక్తదానం చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

World Blood Donor Day 2022: రక్తదానం చేయడం వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అందుకే రక్తదానాన్ని మహాదానమని, రక్తదానం చేసేవాళ్లని ప్రాణదాతలంటుంటారు. అయితే దురదృష్టవశాత్తూ చాలామంది రక్తదానం..

World Blood Donor Day 2022: రక్తదానం చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Blood Donation
Follow us

|

Updated on: Jun 13, 2022 | 11:51 AM

World Blood Donor Day 2022: రక్తదానం చేయడం వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అందుకే రక్తదానాన్ని మహాదానమని, రక్తదానం చేసేవాళ్లని ప్రాణదాతలంటుంటారు. అయితే దురదృష్టవశాత్తూ చాలామంది రక్తదానం (Blood Donation) చేయడానికి వెనుకాడుతుంటారు ఎందుకంటే అది వారి శరీరంలో హిమోగ్లోబిన్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుందని, తీవ్ర బలహీనతకు దారి తీస్తుందని వారు భావిస్తుంటారు. కానీ రక్తదానం చేయడం వల్ల ఒకరి జీవితాన్ని కాపాడటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రక్తదానం చేయడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వారు సూచిస్తున్నారు. ఈక్రమంలో రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని (World Blood Donor Day) జరుపుకుంటారు. మరి ఈ సందర్భంగా రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఒకసారి తెలుసుకుందాం రండి.

గుండె జబ్బులు, క్యాన్సర్ నుంచి రక్షణ..

శరీరంలో ఐరన్ మోతాదుకు మించి ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారు రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఐరన్ సమతుల్యంగా ఉంటుంది. అంతేకాదు గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ పొందుతారు. క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గొచ్చు..

స్థూలకాయమే అన్ని రోగాలకు మూలం. అయితే బరువు ఎక్కువగా ఉన్నవారు ఎప్పటికప్పుడు రక్తదానం చేస్తూ, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే శరీరంలోని క్యాలరీలు వేగంగా బర్న్‌ అవుతాయి. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.

అపోహలను నమ్మకండి..

రక్తదానం చేయడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్‌ లెవెల్స్ తగ్గుతాయని, శరీరం బలహీనంగా తయారవుతుందని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇలాంటి అపోహలను నమ్మోద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్లడ్‌ డొనేషన్‌తో శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, కొద్ది రోజల్లోనే శరీరానికి అవసరమైన ఎర్రరక్త కణాలు ఉత్పత్తి అవుతాయని వారు సూచిస్తున్నారు.

మానసిక ఆరోగ్యం..

కాగా రక్తదానం చేసే ముందు..శరీరానికి అవసరమైన పరీక్షలు చేస్తారు. అందులోని నివేదికలు సరిగ్గా ఉన్నప్పుడే రక్తదానం చేయడానికి అర్హులుగా పరిగణిస్తారు. ఇక రక్తదానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే మనం ఓ మంచి పని చేసినప్పుడల్లా, అది మంచి అనుభూతిని కలిగిస్తుంది. అది మన మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి రక్తదానం చేయడమంటే మనం ఒకరికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నట్టే లెక్క. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Coronavirus: దేశంలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. 50 వేలకు చేరువలో యాక్టివ్‌ కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..

Drugs Case: సినిమా ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్‌ కలకలం.. బెంగళూరులో స్టార్‌ హీరోయిన్‌ సోదరుడు అరెస్ట్‌..

Anushka Shetty: అనుష్క సోదరుడి హత్యకు కుట్ర.. భద్రత కల్పించాలని హోం మంత్రికి వినతి పత్రం..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే