AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs Case: సినిమా ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్‌ కలకలం.. బెంగళూరులో స్టార్‌ హీరోయిన్‌ సోదరుడు అరెస్ట్‌..

Siddhanth Kapoor: సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ జాడ్యం కుదిపేస్తోంది. ఎప్పటికప్పుడు పోలీసులు జరుపుతున్న దాడుల్లో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు అరెస్ట్ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్..

Drugs Case: సినిమా ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్‌ కలకలం.. బెంగళూరులో స్టార్‌ హీరోయిన్‌ సోదరుడు అరెస్ట్‌..
Siddhant Kapoor
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 13, 2022 | 8:32 PM

Share

Siddhanth Kapoor: సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ జాడ్యం కుదిపేస్తోంది. ఎప్పటికప్పుడు పోలీసులు జరుపుతున్న దాడుల్లో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు అరెస్ట్ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) సోదరుడు సిద్ధాంత్‌ కపూర్‌ (Siddhanth Kapoor)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలో జరిగిన ఓ పార్టీలో డ్రగ్స్ సేవించిన ఆరోపణలపై అతడిని బెంగళూరు (Bangalore) పోలీసులు అరెస్ట్‌ చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ సేవిస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేశారు. ఈ దాడుల్లో సుమారు 35 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో సిద్ధాంత్‌ కూడా ఉన్నారు. వారి శాంపిల్స్‌ని సేకరించి పరీక్షలకు పంపించారు. డ్రగ్స్‌ తీసుకున్నారని నిర్ధారణ అయిన ఆరుగురిలో సిద్ధాంత్‌ కపూర్‌ కూడా ఒకరని పోలీసులు చెబుతున్నట్లు సమాచారం. అయితే వీరంతా డ్రగ్స్‌ తీసుకొని పార్టీకి వచ్చారా.. లేదా పార్టీలోనే డ్రగ్స్‌ తీసుకున్నారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నించిన వారిలో నటి శ్రద్ధా కపూర్ కూడా ఒకరు. సిద్ధాంత్‌ విషయానికొస్తే..స్టార్‌ కిడ్‌ అయినప్పటికీ డిస్క్‌ జాకీగా కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆపై కొన్ని సినిమాల్లోనూ నటించారు. భౌకాల్, షూట్‌ ఔట్‌ వాడాలా, అగ్లీ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఇవి కాకుండా హసీనా పార్కర్ సినిమాలో సోదరితో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Coronavirus: దేశంలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. 50 వేలకు చేరువలో యాక్టివ్‌ కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..

Anushka Shetty: అనుష్క సోదరుడి హత్యకు కుట్ర.. భద్రత కల్పించాలని హోం మంత్రికి వినతి పత్రం..

IND vs SA: కటక్‌లో టీమిండియా ఓటమికి కారణాలివే.. కొంపముంచిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పులు..