IND vs SA: మా తుజే సలాం పాటతో మార్మోగిన క్రికెట్‌ మైదానం.. నెట్టింట్లో రోమాలు నిక్కబొడుచుకునే వీడియో..

IND vs SA Series 2022: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోయింది.ఢిల్లీ మ్యాచ్‌లో పరాజయం పాలైన భారత జట్టు కటక్‌లోనూ కంగుతింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో..

IND vs SA: మా తుజే సలాం పాటతో మార్మోగిన క్రికెట్‌ మైదానం.. నెట్టింట్లో రోమాలు నిక్కబొడుచుకునే వీడియో..
India Vs South Africa
Follow us
Basha Shek

|

Updated on: Jun 13, 2022 | 12:26 PM

IND vs SA Series 2022: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోయింది.ఢిల్లీ మ్యాచ్‌లో పరాజయం పాలైన భారత జట్టు కటక్‌లోనూ కంగుతింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలై సిరీస్‌లో 0-2తో వెనుకబడి పోయింది. కాగా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో బారాబతి మైదానం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఒక్కొక్కరు వెనుదిరిగినప్పటికీ వారిని ఉత్సాహపరుస్తూనే ఉన్నారు. ఇక మ్యాచ్‌ మధ్యలో సెల్‌ఫోన్‌ లైటింగ్‌లలో పాటలు పాడుతూ తమ అభిమాన జట్టును ఎంకరేజ్‌ చేశారు. ఈసందర్భంగా వేలాది మంది కలిసి మా తుజే సలామ్ పాటను ఆలపిస్తూ ఒకేసారి క్రీడాస్ఫూర్తితో పాటు దేశభక్తిని చాటుకున్నారు. దీంతో స్టేడియం మొత్తం సందడితో సందడి సందడిగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రాక్టీస్‌ సెషన్‌కు సైతం పోటెత్తారు..

ఇవి కూడా చదవండి

కాగా ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందు, టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌ను చూసేందుకు కూడా అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే మైదానంలో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనతో వారు కొంచెం నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 148 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. హెన్రిచ్ క్లాసెన్ 46 బంతుల్లో 81 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా మొదటి మ్యాచ్‌లో నిరాశపర్చిన భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా రాణించారు. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అవేష్ ఖాన్ 3 ఓవర్లలో 17 పరుగులతో దక్షిణాఫ్రికాను కట్టడి చేశాడు. అయితే యుజ్వేంద్ర, అక్షర్‌ పటేల్, పాండ్యా తదితరులు ధారాళంగా పరుగులివ్వడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

World Blood Donor Day 2022: రక్తదానం చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Coronavirus: దేశంలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. 50 వేలకు చేరువలో యాక్టివ్‌ కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..

Anushka Shetty: అనుష్క సోదరుడి హత్యకు కుట్ర.. భద్రత కల్పించాలని హోం మంత్రికి వినతి పత్రం..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.