AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs NZ: ఇది కదా పుత్రోత్సాహమంటే.. కుమారుల శతకాలను చూసి పండగ చేసుకున్న తండ్రులు..

England Vs New Zealand Test Series 2022: పిల్లలు ప్రయోజకులైతే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు తల్లిదండ్రులకు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు జో రూట్‌ (Joe Root), (ఓలీపోప్‌ Ollie Pope) ప్రస్తుతం ఇలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు..

ENG vs NZ: ఇది కదా పుత్రోత్సాహమంటే.. కుమారుల శతకాలను చూసి పండగ చేసుకున్న తండ్రులు..
Eng Vs Nz
Basha Shek
|

Updated on: Jun 13, 2022 | 2:02 PM

Share

England Vs New Zealand Test Series 2022: పిల్లలు ప్రయోజకులైతే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు తల్లిదండ్రులకు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు జో రూట్‌ (Joe Root), (ఓలీపోప్‌ Ollie Pope) ప్రస్తుతం ఇలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో తమ కుమారుల సాధిస్తున్న రికార్డులను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాజాగా ఈ ఇద్దరూ ఆటగాళ్లు సెంచరీలు చేయడం, అదే సమయంలో గ్యాలరీలో పక్క పక్కనే ఉన్న వారి తల్లిదండ్రులు పుత్రోత్సాహంతో పొంగిపోవడం, పరస్పరం అభినందనలు చెప్పుకోవడం నెట్టింట్లో వైరల్ గా మారింది. న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌ రెండో టెస్టు సందర్భంగా మూడో రోజు ఆటలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. కుమారుల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియంకు వచ్చిన ఆ తండ్రులు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. నాటింగ్‌హమ్‌ వేదికగా జరగుతున్న ఈ టెస్ట్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. డారిల్‌ మిచెల్‌ (190), టామ్‌ బ్లండల్‌లు రాణించడంతో కివీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 553 పరుగుల భారీస్కోరు అందించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగన ఆతిథ్య జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 473 పరుగులు సాధించింది. టెస్ట్‌లో తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తోన్న మాజీ కెప్టెన్‌ జోరూట్‌ (163 బ్యాటింగ్‌; 25 ఫోర్లు) టెస్టుల్లో 27వ సెంచరీ సాధించాడు. అతనికి తోడు వన్‌డౌన్‌ ఆటగాడు ఓలీపోప్‌ (145; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా సెంచరీ చేయడంతో కివీస్‌కు ధీటుగా బదులిస్తోంది ఇంగ్లండ్‌. ప్రస్తుతం న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లండ్‌ కేవలం 80 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాయి కాబట్టి ఇంగ్లండ్‌ ఆధిక్యం సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇక లార్డ్స్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ పాటకు ఫిదా అయిన క్యాప్‌ జెమినీ చైర్మన్‌.. ఫ్రెండ్స్‌కు ఎలాంటి ఛాలెంజ్‌ విసిరారంటే..

వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే కాఫీలో వీటిని కలుపుకోండి..

IND vs SA: మా తుజే సలాం పాటతో మార్మోగిన క్రికెట్‌ మైదానం.. నెట్టింట్లో రోమాలు నిక్కబొడుచుకునే వీడియో..