Uttar Pradesh: పోలీసు జీపును చోరీ చేసిన ఘనుడు.. కట్ చేస్తే విచారణలో పోలీసులకే రివర్స్ షాక్ ఇచ్చాడు..!

Uttar Pradesh: సాధారణంగానే ఏదైనా ఊరికో, మరేదైనా ప్రాంతానికో వెళ్లాలంటే.. ప్రజా రవాణానో, మరో ప్రత్యేక వాహనాన్ని చూసుకునో బయలుదేరుతాం.

Uttar Pradesh: పోలీసు జీపును చోరీ చేసిన ఘనుడు.. కట్ చేస్తే విచారణలో పోలీసులకే రివర్స్ షాక్ ఇచ్చాడు..!
Police Car
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 14, 2022 | 6:00 AM

Uttar Pradesh: సాధారణంగానే ఏదైనా ఊరికో, మరేదైనా ప్రాంతానికో వెళ్లాలంటే.. ప్రజా రవాణానో, మరో ప్రత్యేక వాహనాన్ని చూసుకునో బయలుదేరుతాం. సొంతంగా కారు, బైక్ ఉంటే వాటిపై వెళ్తాం. కానీ, ఇక్కడ వ్యక్తి మాత్రం తన అత్తారింటికి వెళ్లేందుకు ఏకంగా పోలీసు వాహనాన్నే చోరీ చేశాడు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారును గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లాడు ఆ ఘనుడు. అయితే, కాసేపటికే పోలీసులకు చిక్కాడనుకోండి. కానీ, పోలీసులకు ఆ చిక్కిన ఆ చోర కళా వల్లభుడు.. విచారణలో దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. అది విన్న పోలీసులు ఇదేం గోలరా అయ్యా అని నిట్టూర్చారు. ఇంతకీ అతను ఏం చెప్పాడు.. ఆ పోలీసు జీపును ఎందుకు తీసుకెళ్లాడు.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బేరీరానీ మౌర్య.. సోనాపూర్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ విధులు నిర్వర్తించేందుకు పోలీసు కమిషనర్ సంజయ్​ కుమార్​వెళ్లారు. అయితే, అక్కడ భారీ స్థాయిలో జనం ఉండటంతో జీపు పార్క్​ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. దాంతో కొంత దూరంలో రోడ్డు పక్కన పోలీసు వాహనాన్ని పార్క్​ చేశాడు డ్రైవర్. ఆ పక్కనే అతను సేద తీరుతున్నాడు. ఇంతలో హరేంద్ర(30) అనే వ్యక్తి అక్కడకు వచ్చాడు. పోలీసు కారు రోడ్డు పక్కన ఖాళీగా ఉండటం, దానికే కీ ఉండటాన్ని గమనించాడు. ఎవరి పనిలో వారు బిజీగా ఉండటంతో.. పోలీసు జీపు తీసుకుని పరారయ్యాడు. ఇంతలో జీపును ఎత్తుకెళ్తుండటాన్ని గమనించిన డ్రైవర్ దీపేంద్ర.. పోలీసు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. మరో వాహనంలో ఆ జీపును వెంబడించారు. పోలీసులు తన వెంట పడుతున్నారని గ్రహించిన హరేంద్ర మరింత వేగంతో జీపును నడిపాడు. అయితే, పర్సా క్రాస్ రోడ్డు సమీపంలో జీపు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న దుండగలకు ఢీకొట్టింది. జీపు అక్కడే నిలిచిపోగా.. హరేంద్ర పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, పోలీసులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు.

హరేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించగా.. మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కరియాపార్ గ్రామంలో తన అత్తారింటికి వెళ్తున్నానని, అందుకోసమే వాహనం దొంగిలించానని అతను బదులిచ్చాడు. ఇంట్లో వాళ్లతో గొడవపి, ఫుల్లుగా మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, అతని సమాధానం విన్న పోలీసులు షాక్ అయ్యారు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని, నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని స్థానిక పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..