Srilanka – Adani Power Project: శ్రీలంకలో చిచ్చు రేపిన అదానీ ప్రాజెక్టు.. ఏకంగా ప్రధాని మోదీపై షాకింగ్ ఆరోపణలు..!

Adani Power Project: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఆగమాగంగా ఉన్న శ్రీలంకలో మరో రచ్చ నడుస్తోంది. అది కూడా భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అదానీ

Srilanka - Adani Power Project: శ్రీలంకలో చిచ్చు రేపిన అదానీ ప్రాజెక్టు.. ఏకంగా ప్రధాని మోదీపై షాకింగ్ ఆరోపణలు..!
Pm Modi And Adani
Follow us

|

Updated on: Jun 14, 2022 | 6:01 AM

Adani Power Project: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఆగమాగంగా ఉన్న శ్రీలంకలో మరో రచ్చ నడుస్తోంది. అది కూడా భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అదానీ కేంద్రంగా ఈ రచ్చ రాజుకుంటోంది. అవును.. శ్రీలంకలో పవర్ ప్రాజెక్ట్ వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. సిలోన్ విద్యుత్ బోర్డు చీఫ్ ఫెర్డినాండో రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే.. శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు ఫెర్డినాండో. అదానీ గ్రూపుకు పవర్‌ ప్రాజెక్ట్‌ ఇవ్వాలని భారత ప్రధాని మోదీ నుంచి ఒత్తిళ్లు చేస్తున్నట్టు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స తనకు చెప్పారని, ఈ విషయాన్ని సిలోన్ ఎలక్ట్రిసిటి బోర్డు CEB చైర్మన్ అయిన ఎంఎంసీ ఫెర్డినాండో అక్కడి పార్లమెంటరీ కమిటీ ఎదుట వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సంచలనంగా మారాయి. కాగా, ఈ ఆరోపణలు చేసిన మూడు రోజులకే సీఈబీ చైర్మన్ పదవికి ఫెర్డినాండో రాజీనామా చేశారు. మరోవైపు.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలను శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తోసిపుచ్చారు.