Vijayawada: బాలిక కిడ్నాప్ కేసులో కీలక మలుపు.. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
పట్టపగలు తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో పదో నంబర్ ప్లాట్‌ఫాంపై ఈ ఘటన ఐదు రోజుల క్రితo చోటుచేసుకుంది.
Vijayawada Kidnap Case: విజయవాడ బాలిక కిడ్నాప్ కేసులో పురోగతి లభించింది. కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళతో కలిసి బాలికను విజయ అనే మహిళ అమ్మేసినట్టు గుర్తించారు. సీసీ ఫుటేజ్‌లో కిడ్నాపర్‌ను గుర్తించిన పోలీసులు.. కిడ్నాపర్ విజయతో పాటు.. అంగన్‌వాడీ ఆయాను విచారిస్తున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో మూడేళ్ళ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. పట్టపగలు తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో పదో నంబర్ ప్లాట్‌ఫాంపై ఈ ఘటన ఐదు రోజుల క్రితo చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులు విజయవాడకు చెందిన ముస్లిం మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి షఫీదా అనే పాప ఉంది. ఆంజనేయలు నగరంలో కూలి పని చేస్తుంటాడు. అతడి భార్య చెత్త కాగితాలు ఏరుతుంటుంది. ఇద్దరూ కలిసి రైల్వేస్టేషన్‌లో ఉంటున్నారు. వారి పక్కనే ఉన్న షఫీదాను ఇద్దరు మహిళలు ఎత్తుకుని ఉడాయించారు.
పాప కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు.. జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఒక మహిళ చిన్నారిని తీసుకుని పదో నంబర్ ప్లాట్‌ఫాం మెట్లపై నుంచి బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ మహిళ వెనుక మరో మహిళ వెళ్లడం కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. కిడ్నాపర్ విజయతో పాటు అంగన్వాడీ ఆయా బాలికను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాలిక ఆచూకీ కోసం బృందాలు గాలిస్తున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..