Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే అంగప్రదిక్షణ టోకెన్లు..

జూన్ 15న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. జూన్ 16 నుంచి జులై 31వ తేదీ వరకు టోకెన్లు విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే అంగప్రదిక్షణ టోకెన్లు..
Ttd
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 6:45 PM

Angapradakshinam: శ్రీవారి భక్తులకు అధికారులు గుడ్‌న్యూస్ అందించారు. అంగ ప్రదక్షిణ టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోసం భక్తులు క్యూలైన్‌లో గంటలు తరబడి వేచి ఉండే పద్ధతికి ఇకపై స్వస్తి పలకనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్న టీటీడీ పేర్కొంది. జూన్ 15న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. జూన్ 16 నుంచి జులై 31వ తేదీ వరకు టోకెన్లు విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రోజుకు 750 టోకెన్లు అందుబాటులో ఉంచనున్న టీటీడీ పేర్కొంది.

వేలానికి శ్రీవారి వస్త్రాలు..

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 149 లాట్ల వ‌స్త్రాల‌‌ను టీటీడీ ‘ఈ వేలం’ వేయనున్నది. ఈ నెల 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నమని ప్రకటించింది. ఈ వేలంలో పాలిస్టర్ నైలాన్, నైలెక్స్ చీర‌లు, ఆర్ట్ సిల్క్ చీర‌లు, బ్లౌజ్‌పీస్‌లు కొత్తవి, స్వామివారి సేవకు వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.

ఇవి కూడా చదవండి

స్వామివారి వస్త్రాలు కొనుగోలు చేసే ఆసక్తిగల భక్తులు ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంది. 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in / www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.