Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్వామివారి వస్త్రాలను ఈ వేలం వేయనున్న టీటీడీ.. ఎప్పటి నుంచి అంటే

వేంకటాచల నాథుడికి సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ తమ శక్తి కొలదీ కానుకలను సమర్పిస్తారు. ధన, కనుక, వస్తువులను కానుకలుగా.. భూరి భూమిని విరాళముగా ఇస్తారు. అయితే ఇలా స్వామివారికి సమర్పించిన వస్త్రాలను శేష వస్త్రాలుగా ప్రసాదంగా భావించి భక్తులు తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్వామివారి వస్త్రాలను ఈ వేలం వేయనున్న టీటీడీ.. ఎప్పటి నుంచి అంటే
Ttd Clothes E Auction
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2022 | 7:19 PM

Tirumala:  కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి (sri venkateswara swami) కలియుగ దైవంగా పూజలను అందుకుంటున్నాడు. కలియుగంలో మానవాళిని కష్టనష్టాల నుంచి రక్షించడానికి వెలిశాడని భక్తుల నమ్మకం. స్వామివారిని రోజూ భారీ సంఖ్యలో దర్శించుకుంటారు. వేంకటాచల నాథుడికి సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ తమ శక్తి కొలదీ కానుకలను సమర్పిస్తారు. ధన, కనుక, వస్తువులను కానుకలుగా.. భూరి భూమిని విరాళముగా ఇస్తారు. అయితే ఇలా స్వామివారికి సమర్పించిన వస్త్రాలను శేష వస్త్రాలుగా ప్రసాదంగా భావించి భక్తులు తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారి వస్త్రాలను ఈ వేలం వేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రెడీ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 149 లాట్ల వ‌స్త్రాల‌‌ను టీటీడీ ‘ఈ వేలం’ వేయనున్నది. ఈ నెల 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నమని ప్రకటించింది. ఈ వేలంలో పాలిస్ట‌ర్ నైలాన్, నైలెక్స్ చీర‌లు, ఆర్ట్ సిల్క్ చీర‌లు, బ్లౌజ్‌పీస్‌లు కొత్త‌వి, స్వామివారి సేవకు వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.

స్వామివారి వస్త్రాలు కొనుగోలు చేసే ఆసక్తిగల భక్తులు  ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని  సంప్రదించాల్సి ఉంది. 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in  / www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి