AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srinivasa Kalyanam: శ్రీనివాసుడి కల్యాణానికి ముస్తాబవుతున్న అమెరికా.. ఈనెల 18 నుంచి ఉత్సవాలు.. భక్తులకు ఉచితం

గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు.

Srinivasa Kalyanam: శ్రీనివాసుడి కల్యాణానికి ముస్తాబవుతున్న అమెరికా.. ఈనెల 18 నుంచి ఉత్సవాలు.. భక్తులకు ఉచితం
Sri Venkateswara Kalyanam I
Surya Kala
|

Updated on: Jun 11, 2022 | 4:21 PM

Share

TTD: అగ్రరాజ్యం అమెరికా దేశంలో శ్రీవారి భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణం నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఎనిమిది నగరాల్లో శ్రీనివాసుడి కళ్యాణం నిర్వహించనున్నామని తిరుమలలో శనివారం సుబ్బారెడ్డి.. ఈవో శ్రీ ధర్మారెడ్డి తో కలసి మీడియా సమావేశంలో తెలిపారు. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు. ఆంధప్రదేశ్ ప్రవాసభారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీనివాసుడి కల్యాణోత్సవంలో భక్తులు ఉచితంగా కల్యాణంలో పాల్గొనవచ్చనని తెలిపారు.

శ్రీనివాసుడి కళ్యాణం జరిగే నగరాలు, తేదీలు

జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తామని ఛైర్మన్ చెప్పారు. అలాగే జూలై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డిసి, 9వ తేదీ అట్లాంటా నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు జరుగుతాయన్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఇతర దేశాల నుంచి కూడా తమ ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని టీటీడీకి విజ్ఞప్తులు వచ్చాయని..  వాటిని కూడా పరిశీలిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.

ప్రపంచం వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..