Viral Video: వీడు మామూలోడు కాదు.. కోపంతో రగిలిపోతున్న భారీ కోబ్రాను ఇట్టే పట్టేశాడు.. షాకింగ్ వీడియో

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి రోడ్డు పక్కన కోపంతో ఉన్న తాచుపాముని సెకన్లలో సులభంగా పట్టుకున్నాడు.

Viral Video: వీడు మామూలోడు కాదు.. కోపంతో రగిలిపోతున్న భారీ కోబ్రాను ఇట్టే పట్టేశాడు.. షాకింగ్ వీడియో
Cobra Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 13, 2022 | 5:35 PM

Cobra Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాముల్లో కోబ్రా ఒకటి. దాని ఒక చుక్క విషం.. నిమిషాల్లోనే ప్రాణం తీస్తుంది. సాధారణ పాముల కంటే కోబ్రా చాలా రెట్లు పెద్దది.. శక్తివంతమైనది. దీన్ని నియంత్రించడం అందరికీ సాధ్యం కాదు. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి రోడ్డు పక్కన కోపంతో ఉన్న తాచుపాముని సెకన్లలో సులభంగా పట్టుకున్నాడు. ఈ వీడియో అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటిది చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు పక్కన ఉన్న వ్యక్తి.. ప్రమాదకరమైన నాగుపామును పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండటాన్ని మీరు చూడవచ్చు. ఆ వ్యక్తి వద్ద ఎలాంటి సేఫ్టీ ఎక్విప్‌మెంట్ కూడా లేదు. ఇది చూస్తుంటే.. అతను పాములు పట్టేవాడు కాదని తెలుస్తోంది. అతను పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో.. అది అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా తల భాగం దగ్గర గట్టిగా పట్టుకుంటాడు. ఈ వీడియో చూసి అందరూ ఇలా ఎలా సాద్యం అంటూ పేర్కొంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ముందుగా వీడియో చూడండి..

వైరల్ వీడియో..

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్‌లో ట్రెండ్ టూర్ థాయిలాండ్ అనే పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 90 లక్షల మంది వీక్షించడంతోపాటు.. 2 లక్షల మందికి పైగా లైక్ చేసారు. అదే సమయంలో.. ఇలాంటి వీడియోను ఇప్పటివరకు చూడలేదంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు సైతం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!