Hyderabad: దుబాయ్‌కి వెళ్లిన భర్త తనతో మాట్లాడడం లేదని భార్య దారుణం, తల్లికి ఫోన్‌ చేసి ఇలా..

ఇటీవలి కాలంలో ఆత్మహత్యల సంఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు సైతం పరీక్షల ఒత్తిడి, ఫలితాల వెల్లడితో మనస్తాపానికి గురై..

Hyderabad: దుబాయ్‌కి వెళ్లిన భర్త తనతో మాట్లాడడం లేదని భార్య దారుణం, తల్లికి ఫోన్‌ చేసి ఇలా..
Follow us

|

Updated on: Jun 14, 2022 | 7:50 AM

ఇటీవలి కాలంలో ఆత్మహత్యల సంఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు సైతం పరీక్షల ఒత్తిడి, ఫలితాల వెల్లడితో మనస్తాపానికి గురై సూసైడ్‌ చేసుకుంటున్న ఘటనలు వారి తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దుబాయ్‌కి వెళ్లినప్పటి నుంచి భర్త తనతో సరిగ్గా మాట్లాడడం లేదని తీవ్ర మనస్తాపం చెందిన భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఫలక్​నుమా పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. ఫలక్​నుమా ఇన్​స్పెక్టర్​ దేవేందర్​తెలిపిన వివరాల ప్రకారం… హజీరాబేగం(21), అస్లాం హుస్సేన్​దంపతులు. వీరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. వారం రోజుల క్రితం భర్త అస్లాం హుస్సేన్​ దుబాయ్‌కి వెళ్లాడు. దుబాయ్‌కి వెళ్లినప్పటి నుంచి భర్త సరిగా ఫోన్​మాట్లాడటం లేదని తన తల్లికి హజీరాబేగం చెప్పి బాధపడేది. దీంతో నా జీవితం నాశనమయ్యిందని తల్లికి ఫోన్​ చేసి రోధించేది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి చెందిన హజీరాబేగం ఆదివారం ఉదయం చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు ఫలక్​నుమా పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫలక్​నుమా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును ఫలక్​నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే