Constable Suspension : నడిరోడ్డుపై మందుబాబును తన్నిన కానిస్టేబుల్‌.. వీడియో వైరల్, ఆ తర్వాత సీన్‌ రివర్స్‌

తిరుపతిలో ఓ ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న కానిస్టేబుల్‌ ప్రతాపం ప్రదర్శించాడు. స్థానిక అన్నమయ్య సర్కిల్ లో ఓ వ్యక్తిని పోలీస్ కాలితో తన్నాడు. తిరుపతిలో రోడ్డుపై ఓ వ్యక్తిని కాలితో పదేపదే తన్నడం సోషల్ ‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Constable Suspension : నడిరోడ్డుపై మందుబాబును తన్నిన కానిస్టేబుల్‌.. వీడియో వైరల్, ఆ తర్వాత సీన్‌ రివర్స్‌
Ap Traffic Cop
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2022 | 7:18 AM

తిరుపతిలో ఓ ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న కానిస్టేబుల్‌ ప్రతాపం ప్రదర్శించాడు. స్థానిక అన్నమయ్య సర్కిల్ లో ఓ వ్యక్తిని పోలీస్ కాలితో తన్నాడు. తిరుపతిలో రోడ్డుపై ఓ వ్యక్తిని కాలితో పదేపదే తన్నడం సోషల్ ‌ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వ్యక్తి పడుతున్నా వదలకుండా కాలితో తన్నిన వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీస్‌శాఖపై విమర్శలు రావడంతో బాధ్యుడైన హెడ్‌కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటువేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌లో విధులు నిర్వర్తిస్తోన్న కానిస్టేబుల్‌ టి.జగదీష్‌ కిషోర్‌ మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై దాడి చేశాడనే అభియోగాపలపై సస్పెండ్ అయ్యారు.తను ఉద్దేశపూర్వకంగా తన్నలేదని సదరు హెడ్ కానిస్టేబుల్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వీడియో తెగ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో సదరు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు అధికారులు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ఘటనలపై తిరుపతి డీఎస్పీ కాటం రాజు మాట్లాడుతూ… మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి, ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ తో గొడవ జరిగిందని, మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని బస్సులో ఎక్కించుకోవడానికి అనుమతించకపోవడంతోనే గొడవ జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో ఈ గొడవ గురించి తెలుసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ విషయాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించాడని,.. అయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించడంతో కానిస్టేబుల్ ఇలా చేశాడని వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి