AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ante Sundaraniki: అంటే సుందరానికీ.. ఆవకాయ్ లాంటి సినిమా.. న్యాచురల్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌ టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 10న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

Ante Sundaraniki: అంటే సుందరానికీ.. ఆవకాయ్ లాంటి సినిమా.. న్యాచురల్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Nani
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2022 | 7:06 AM

Share

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన అంటే సుందరానికీ (Ante Sundaraniki) సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రీయా నజీమ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్స నిర్మించారు.. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌ టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 10న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అరుదైన చిత్రంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్రయూనిట్ అంటే సుందరానికీ సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ..’అంటే సుందరానికీ’ విజయం టీం సమిష్టి కృషి. ‘అంటే సుందరానికీ’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. అయితే ఈ సెలబ్రేషన్ కేవలం బాక్సాఫీసు నెంబర్లే కాదు.. ఈ రోజు ప్రేక్షకుల హృదయాలని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా సినిమాకి దక్కిన ప్రేమని, ప్రేక్షకుల ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్లాక్ బస్టర్ అనేది సమయం చెబుతుంది. కానీ సినిమా చూసిన వారి కళ్ళల్లో ఆనందం, వారి ప్రేమ విషయంలో ‘అంటే సుందరానికీ’ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. దాన్ని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అంటే సుందరానికీ కూడా అలా అరుదైన సినిమానే. ఈ చిత్రానికి మరో చిత్రంతో పోలిక లేదు. ఇలా అరుదుగా వచ్చే సినిమాని మనం అందరం భుజాన వేసుకొని ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో మనం భాగమౌతాం. ఇది మనందరి సినిమా. ఇది మనందరి విజయం. మనందరి సెలబ్రేషన్. ‘అంటే సుందరానికీ’ కి వస్తున్న రెస్పాన్స్, అభిమానులు పెడుతున్న మెసేజులు చూస్తుంటే కడుపు నిండిపోయింది. చాలా ఆనందంగా వుంది. నా కెరీర్ టాప్ ఆర్డర్ లో వుండే సినిమా ‘అంటే సుందరానికీ’. సులువైన మార్గాలు చాలా వున్నపుడు ఇలాంటి అంటే సుందరానికీ లాంటి కథ చెప్పడానికి చాలా గట్స్ కావాలి. ఆ గట్స్ మా దర్శకుడు వివేక్ ఆత్రేయలో వున్నాయి. మా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ లో వున్నాయి. నాలో, మా టీమ్ అందరిలో వున్నాయి. ఇది అవకాయ్ లాంటి సినిమా. మూడు రోజులు రుచి చూసారంటే రోజురోజుకి ఊరుతుంది. రుచి ఇంకా పెరుగుతుంది. రెండేళ్ళ తర్వాత కూడా మంచి తెలుగు సినిమా పేర్లు చెప్పమని ఎవరైనా అడిగితే చెప్పే రెండు మూడు పేర్లలో అంటే సుందరానికీ వుంటుంది” అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!