Major Movie: మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన మేజర్ టీం.. ఆర్మీలో చేరాలనుకునేవారికి సాయం చేస్తామన్న సీఎం..
26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరెకెక్కిన ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడి చేత కన్నీళ్లు
టాలెంటెడ్ హీరో అడివి శేష్.. డైరెక్టర్ శశికిరణ్ తిక్క కాంబోలో వచ్చిన మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరెకెక్కిన ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. మేజర్ సినిమా కాదని.. ఓ ఎమోషన్ అంటూ ఇదివరకే చిత్రయూనిట్ చెప్పిన సంగతి తెలిసిందే. మేజర్ సినిమా అద్భుతమని.. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా చూపించారని.. అడివి శేష్ నటన మరో లెవల్ అంటూ ప్రేక్షకులే కాకుండా.. సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. మేజర్ చిత్రయూనిట్ ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.. తాజాగా మేజర్ చిత్రయూనిట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. ఈ విషయాన్ని అడివి శేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
“మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ ఠాక్రేని కలిసే అద్భుతమైన అవకాశం వచ్చింది.. వారు NDAలో చేరానుకున్నవారికి సాయం చేయాలనే మా నిర్ణయానికి అన్ని రకాలుగా మద్దతునిస్తానని హామీ ఇచ్చారు. ఇది ఒక అపురూపమైన క్షణం. మా సినిమా గురించి అద్భుతమైన మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్” అంటూ ట్వీట్ చేశారు అడివి శేష్.
Had the incredible opportunity to meet the Honourable CM of Maharashtra Shri UddhavThackeray. He promised to extend full support for our MAJOR promise fund for NDA aspirants. It was an incredible moment. Thank you for the amazing words about our film sir. @CMOMaharashtra (1/2) pic.twitter.com/xOKN5liRk7
— Adivi Sesh (@AdiviSesh) June 13, 2022
“మేజర్ సినిమా కంటే ఎక్కువ. 26/11 ముంబై దాడులలో దేశం కోసం పోరాడుతూ తన ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం.. అతని పరాక్రమాన్ని అద్భుతంగా చిత్రీకరించినందుకు మేజర్ టీంకు అభినందనలు” అని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. జూన్ 3న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు సమాజంలోని అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంటుంది. కరోనా సంక్షోభం తర్వాత భారతదేశంలో అత్యంత విజయవంతమైన చిత్రాలలో మేజర్ ఒకటి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.