AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. బాలయ్య..అనిల్ సినిమా టైటిల్ సరికొత్తగా.. ఏంటంటే..

ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై

Balakrishna: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. బాలయ్య..అనిల్ సినిమా టైటిల్ సరికొత్తగా.. ఏంటంటే..
Balakrishna
Rajitha Chanti
| Edited By: |

Updated on: Jun 13, 2022 | 8:32 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ఇటీవల అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ తర్వాత బాలయ్య తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. పూర్తి మాస్ యాక్షన్ నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయనున్నాడు..

ఇప్పటికే వీరిద్దరి ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన సైతం వచ్చింది. ఇందులో బాలయ్యను సరికొత్తగా చూపించబోతున్నానని.. తన మార్క్ కామెడీని పక్కన పెట్టి.. యాక్షన్ నేపథ్యంలో మూవీ చేయబోతున్నట్లుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు. తాజాగా ఈ సినిమా గురించి మరో లేటేస్ట్ అప్డేట్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు బ్రో.. ఐ డోంట్ కేర్ అని టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాక్. ఇందులో బాలయ్య 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారని.. ఆయన కూతురుగా శ్రీలీల కనిపించనుందని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా.. ఇందులో బాలయ్య సరసన ప్రియమణి.. ప్రతినాయకురాలిగా అంజలి నటించనుందని తెలుస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!