Ranbir Kapoor: వివాహమైన మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లాం.. మ్యారేజ్‌ లైఫ్‌పై చాక్లెట్‌ బాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Ranbir Kapoor- Alia Bhatt: తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్రాండ్‌గా పెళ్లిపీటలెక్కారు అలియాభట్‌ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)...

Ranbir Kapoor: వివాహమైన మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లాం.. మ్యారేజ్‌ లైఫ్‌పై చాక్లెట్‌ బాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Alia Bhatt
Follow us
Basha Shek

|

Updated on: Jun 14, 2022 | 8:00 AM

Ranbir Kapoor- Alia Bhatt: తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్రాండ్‌గా పెళ్లిపీటలెక్కారు అలియాభట్‌ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). ప్రస్తుతం బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్స్‌లో ఒకరైన వీరు తమ తమ సినిమాలతో బిజిబిజీగా గడుపుతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తుండగా.. అలియా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ రియల్ జంట మొదటిసారి కలిసి రీల్ జోడీగా నటించిన సినిమా బ్రహ్మస్త్ర (Brahmastra). అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన రణ్‌బీర్ తన మ్యారేజ్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పెళ్లైందని నమ్మకం కుదరడం లేదు.. ‘వివాహం తర్వాత మా జీవితంలో పెద్ద మార్పు లేమీ లేవు. మేం ఐదేళ్లుగా కలిసే ఉంటున్నాం. పెళ్లైతే చేసుకుందామనుకున్నాం.. కానీ కొన్ని కమిట్మెంట్స్ ఉండడంతో వెనకడుగు వేశాం. అందుకే పెళ్లయిన మరుసటి రోజే మేమిద్దరం షూటింగ్‌కి వెళ్లిపోయాం. అలియా ప్రస్తుతం లండన్ లో ఉంది. తను తిరిగి వచ్చిన తర్వాత నా శంషేరా విడుదల కాగానే, ఒక వారం పాటు వెకేషన్‌కు వెళ్లాలని భావిస్తున్నాం. నిజం చెప్పాలంటే.. మాకు పెళ్లయిందని ఇప్పటికీ నాకు నమ్మకం కుదరడం లేదు. ఇక నాకు ఆడిషన్స్ అంటే చాలా భయం. అలియా సాధించిన విజయాలను కానీ, కలలను మరెవరిలోనూ చూడలేదు. అయితే నాకు హాలీవుడ్ గురించి కలలు లేవు. కేవలం నాకు బాలీవుడ్‌ గురించి కలలు మాత్రమే ఉన్నాయి. బ్రహ్మాస్త్ర సినిమా విషయానికొస్తే.. మన సంస్కృతిలో ఉన్న ఒరిజినల్ కంటెంట్, అందరినీ అలరిస్తుందని నా అభిప్రాయం’ అని చెప్పుకొచ్చాడు.

కాగా దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర ని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అలియా దంపతులతో పాటు అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Kajal Agarwal: ముద్దుల కుమారుడి మరో ఫొటోను షేర్‌ చేసిన చందమామ.. ఈసారి ముఖం కనిపించేలా.. వైరలవుతోన్న క్యూట్‌ ఫొటో..

Chiranjeevi: మహేశ్‌ను చూస్తోంటే గర్వంగా ఉంది.. మేజర్ సినిమాపై మెగాస్టార్‌ ప్రశంసలు.. చెవి పోగులతో చిరు లుక్‌ వైరల్‌..

Hyderabad: దుబాయ్‌కి వెళ్లిన భర్త తనతో మాట్లాడడం లేదని భార్య దారుణం, తల్లికి ఫోన్‌ చేసి ఇలా..