AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmastra: ‘అందరిని వశం చేసుకునే చీకటి రాణి.. బ్రహ్మాస్త్రం కోసం ఆరాటం’.. మౌనీ రాయ్ ఫస్ట్ లుక్ అదుర్స్..

ఈసినిమాను స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ , స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, మౌనీ రాయ్,

Brahmastra: 'అందరిని వశం చేసుకునే చీకటి రాణి.. బ్రహ్మాస్త్రం కోసం ఆరాటం'.. మౌనీ రాయ్ ఫస్ట్ లుక్ అదుర్స్..
Mouni Roy
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2022 | 11:58 AM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మస్త్ర (Brahmastra). రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాను స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ , స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, మౌనీ రాయ్, నాగార్జున అక్కినేని కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీ పై మరింత ఆసక్తిని కలిగించాయి. ఇక ఇటీవల విడుదలైన నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని 2022 సెప్టెంబర్ 9న హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న హీరోయిన్ మౌనీ రాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. “అందరిని వశంలోకి తీసుకునే చీకటి రాణి.. బ్రహ్మాస్త్రాన్ని తన సొంతం చేసుకోవడమే జునూన్ లక్ష్యం”… అంటూ ట్వీట్ చేసింది బ్రహ్మస్త్ర చిత్రయూనిట్. తాజాగా విడుదలైన మౌనీ రాయ్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో ఆమె.. క్వీన్ ఆఫ్ డార్క్నెస్.. అంటే చీకటిరాణి జూనూన్ గా కనిపించనుంది. ఇందులో క్రూరమైన క్వీన్ గా కనిపిస్తోంది. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్ట్‏లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో మొదటి పార్ట్ శివ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. . జూలై 15న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us