Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: ఏడు జన్మలు కాదు, ఏడు సెకన్లు కూడా ‘ఈ భార్యలు మాకొద్దు దేవుడా’.. భార్య బాధితుల వింత వ్రతం

ఏడు సెకన్లు కూడా భరించలేం.. ఈ భార్యలు మాకొద్దు దేవుడా అంటున్నారు భార్య బాధితులు.. విముక్తి కోసం వింత వత్రం చేస్తున్నారు. తమ గోడు వినమంటూ ఆ భగవంతుడికి ఇలా పెట్టుకుంటున్నారు..

Trending: ఏడు జన్మలు కాదు, ఏడు సెకన్లు కూడా 'ఈ భార్యలు మాకొద్దు దేవుడా'.. భార్య బాధితుల వింత వ్రతం
Wife Victim Men
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2022 | 11:09 AM

వివాహం.. అంటే ఇద్దరు మనుషులే కాదు, ఇరు కుటుంబాల కలయిక. వివాహం అనేది జన్మల జన్మల బంధం అని అంటారు. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు(మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్) అని అంటారు. అయితే, పెళ్లంటే నూరేళ్ల పంట అని పెళ్లి కాకముందు అందరూ అనుకుంటారు. కానీ పెళ్లయ్యాక మెజార్టీ మగాళ్లు మాత్రం ‘పెళ్లంటే నూరేళ్ల మంట’ అని వాపోతుంటారు. భార్యలు పెట్టే బాధలు భరించలేక చాలా మంది బయటపడుతుంటారు. అలా బయటకొచ్చిన వారంతా కలిసి ఇప్పటికే పలు సంఘాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదే భార్య బాధితుల సంఘం.. ఇంతకీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే.. ఓ చోట ఇలాంటి భార్య బాధితులంతా కలిసి వింత పూజలు చేశారు. వినూత్న నోములు నోచుకున్నారు. వివరాల్లోకి వెళితే…

సాధారణంగా ప్రతి ఇల్లాలు తన భర్త బాగోగులు, సౌభాగ్యం కోరుకుంటూ పూజలు చేస్తుంటారు. అందుకోసం తులసీ కోటకు ప్రదక్షిణ చేస్తారు. తమ బంధం ఏడేడు జన్మలకు కలిసే ఉండాలని కోరుకుంటూ రావి చెట్టుకు రక్షా బంధనం చుడతారు. అయితే, ఇప్పుడు భార్యాబాధితుల సంఘం సభ్యులు ఇలాంటి వింత పూజలే చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కొందరు భార్య బాధితులు చేసిన వినూత్న పూజాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఏడు జన్మలు కాదు.. ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దంటూ దేవుణ్ని అర్థించారు.

Wife Victim

Wife Victim

వట్ సావిత్రి పౌర్ణమికి కొన్ని రోజుల ముందు, కొందరు వ్యక్తులు రావి చెట్టుకు పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు. వచ్చే ఏడు జన్మలు కాదు, ఈ ఏడు సెకన్లు కూడా ఈ భార్య మాకొద్దంటూ దేవుడిని వేడుకున్నారు. వాలుజ్‌ జిల్లాలోని ఆశ్రమంలో వట్‌ సావిత్రి పౌర్ణమిని జరుపుకున్నారు. వట సావిత్రి పౌర్ణమి రోజున మహిళలు ఏడు జన్మలకూ ఒక్కరే భర్తగా రావాలని పూజలు చేస్తుంటారు. భార్యాబాధితుల సంఘం సభ్యులు మాత్రం.. విచిత్రంగా ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దు దేవుడా.. అంటూ రావి చెట్టూ ప్రదక్షిణలు చేస్తూ, పూజలు చేశారు. పురుషులు ప్రదర్శన చేస్తున్నప్పుడు, ఆశ్రమ వ్యవస్థాపకులు, సిబ్బంది సహా చాలా మంది హాజరయ్యారు. భార్య బాధితుల సంఘం ఎప్పుడూ తమ భార్యల వల్ల ఇబ్బంది పడే పురుషుల తరపున పోరాడుతుందన్నారు.

ఇవి కూడా చదవండి
Wife Victim 1

Wife Victim 1

స్త్రీలు వట్ సావిత్రి పౌర్ణమి నాడు రావిచెట్టుకు పూజలు చేసి తమ కోర్కెలను తీర్చాలని ఆ భగవంతుడి వేడుకోవడం ఆనవాయితీ. సోమవారం రోజున జరిగిన ఈ వింత పూజలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వింత వింత కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..