Black Magic: మేకను చంపి కుండలో పెట్టి వింత పూజలు.. భయంతో వణికిపోతున్న స్థానికులు

ఓ వైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంటే.. మరోవైపు కొంతమంది ఇంకా మూఢవిశ్వాసాలను పట్టుకుని వేలాడుతున్నారు. అర్ధరాత్రి వేళ పూజలు నిర్వహిస్తూ.. భయాందోళనకు గురిచేస్తున్నారు.

Black Magic: మేకను చంపి కుండలో పెట్టి వింత పూజలు.. భయంతో వణికిపోతున్న స్థానికులు
Black Magic
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2022 | 10:44 AM

ఓ వైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంటే.. మరోవైపు కొంతమంది ఇంకా మూఢవిశ్వాసాలను పట్టుకుని వేలాడుతున్నారు. అర్ధరాత్రి వేళ పూజలు నిర్వహిస్తూ.. భయాందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఊర్లో క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు గమనించిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

నారాణపేట జిల్లా కేంద్రంలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని మద్దూర్ మండలం, పల్లెర్లో కొందరు వ్యక్తులు విచిత్ర పూజలు చేశారు. క్షుద్రపూజల ఆనవాళ్లుగా గుర్తించిన స్థానికులు భయంతో వణికిపోయారు. వింత పూజలు చేసిన కొందరు వ్యక్తులు.. మేకను చంపి కుండలో పెట్టి పూజలు చేశారు. అక్కడి సీన్‌ చూసిన ప్రతి ఒక్కరూ వణికిపోయారు. ఈ ఘటన చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, పూజలు చేస్తుండగా కొందరు స్థానికులు వారిని గమనించారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి పూజలు చేస్తున్న వారిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కుండలో ఉన్నవాటిని చూసి ఒక్కసారిగా గ్రామస్తులు షాక్ అయ్యారు. అందులో చంపేసి పెట్టిన మేక కళేబరంతో పాటు, ఓ ఒప్పంద పత్రం కూడా ఉండటం గమనించి వాపోయారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రంలో ఆసక్తికలిగించే విషయాలు ఉన్నట్లు తెలిసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి