Viral Video: అత్తగారు జడ్జి.. కోడలు కూతురు పోటాపోటీగా డ్యాన్స్.. చీరలో కూడా కోడలు డ్యాన్స్ సూపర్బ్ అంటున్న నెటిజన్లు..

కూతురు, కొత్త కోడల మధ్య మధ్య డ్యాన్స్ పోటీ జరుగుతుండగా.. ఈ పోటీని ఇంటి పెద్ద అత్తగారు వీక్షిస్తుంది. కూతురు, కోడలు ఇద్దరూ పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లు ఒకరితో ఒకరు పోటీపడుతూ.. స్టెప్స్ వేశారు.

Viral Video: అత్తగారు జడ్జి.. కోడలు కూతురు పోటాపోటీగా డ్యాన్స్.. చీరలో కూడా కోడలు డ్యాన్స్ సూపర్బ్ అంటున్న నెటిజన్లు..
Dance Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 14, 2022 | 11:10 AM

Viral Video: వివిధ రకాలైన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతూ సందడి చేస్తుంటాయి. కొన్ని వీడియోలు మనల్ని  నవ్విస్తాయి,  కొన్ని వీడియోలు మనల్ని ఏఏడిపిస్తాయి. ఇంకొన్ని ఫన్నీగా ఉంది.. వినోదాన్ని పంచుతాయి. అలా ఫన్నీగా ఉండి .. నవ్వేలా చేసే వీడియోల్లో ముఖ్య పాత్ర డ్యాన్స్ కు చెందినవి ఎక్కువగా ఉంటున్నాయి. డ్యాన్స్ కు (Dance Video) సంబంధించిన చాలా వీడియోలను ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పెళ్లి వేడుకల సమయంలో తర్వాత కొత్త ఇంట్లో అడుగు పెట్టిన సందర్భంలో బావమరిది, కోడలు చేసే డ్యాన్స్ ఉంటేచాలు నెటిజన్లు పదే పదే చూస్తుంటారు.  అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో గత మూడేళ్ళ నుంచి నెటిజన్లను అలరిస్తూనే ఉంది. ఇందులో కోడలు, కూతురు  మధ్య డ్యాన్స్ పోటీ జరిగింది. కూతురు, కొత్త కోడల మధ్య  మధ్య డ్యాన్స్ పోటీ జరుగుతుండగా.. ఈ పోటీని ఇంటి పెద్ద అత్తగారు వీక్షిస్తుంది. కూతురు, కోడలు ఇద్దరూ పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లు ఒకరితో ఒకరు పోటీపడుతూ.. వేసిన డ్యాన్స్ స్టెప్పులకు ప్రేక్షకురాలు ఒక్క అత్తగారు మాత్రమే కాదు.. గ్రామస్థులు, ఇరుగుపొరుగువారు కూడా.. ఉన్నారు.

ఇంటి బయట మంచమీద అత్తగారు కుర్చీని ఉంది. ఇంతలో ఇంటిలోపల నుంచి జీన్స్ టీ షర్ట్ వేసుకున్న కూతురు, చీర కట్టుకున్న కోడలు ఆమె ముందు డ్యాన్స్ చేయడం వీడియోలో చూడవచ్చు. హర్యాన్వీ పాట ‘మనే జీతే జీ మారేగీ…’ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది.. ఈ పాటకు ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ సమయంలో వీరి డ్యాన్స్‌ను చూసేందుకు జనం కూడా వచ్చారు. డ్యాన్స్‌ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు ఇద్దరిలో బెటర్ డ్యాన్సర్ ఎవరో మీరే వీడియో చూసి డిసైడ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో 3 సంవత్సరాల క్రితం అయినప్పటికీ.. ఇప్పటికీ చాలా మందికి ఇష్టమైన వీడియో. ఈ వీడియోను అల్కా మ్యూజిక్ హిట్ యూట్యూబ్‌లో షేర్ చేసింది.  230 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ ను, 4 లక్షల మందికి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. కొందరు కోడలు డ్యాన్స్ బాగుందని అంటే.. మరొకొందరు కూతురు కూడా చీర కట్టుకుని ఉంటే    ఉండేదని మరికొందరు అంటున్నారు. చీరలో కూడా కోడలు చాలా బాగా డ్యాన్స్ చేసిందని ఓ యూజర్ ఆశ్చర్యపోతున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..