Viral Video: వేసవి ఉపశమనం కోసం ఆవులకు దాతల స్పెషల్ మెనూ.. 800 లీటర్ల మ్యాంగో జ్యూస్ వీడియో వైరల్..

శాఖాహారి జంతువైన ఆవుకు భిన్నమైన ఆహారాన్ని అందించారు ఇటీవల కొంతమంది దాతలు.. గుజరాత్ వడోదరలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Viral Video: వేసవి ఉపశమనం కోసం ఆవులకు దాతల స్పెషల్ మెనూ.. 800 లీటర్ల మ్యాంగో జ్యూస్ వీడియో వైరల్..
Cow Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2022 | 8:04 AM

Special food for Cows: హిందువులు గోవులను దైవంతో సమానంగా పూజిస్తారు..  అనాది నుంచీ ఆరాధ్య దేవత. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. సకల దేవతా స్వరూపం గోమాత అని .. గోవుని పూజిస్తే.. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని మన పెద్దలు చెబుతు ఉంటారు. మానవ జాతికి ఆవుకన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. అందుకనే గోమాత రక్షణ కోసం అనేక ధార్మిక సంస్థలు, ఆలయాలు పాటుపడుతున్నాయి. శాఖాహారి జంతువైన ఆవుకు భిన్నమైన ఆహారాన్ని అందించారు ఇటీవల కొంతమంది దాతలు.. గుజరాత్ వడోదరలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..

కజ్రాన్ మియాగం ప్రాంతంలోని పంజ్రపోల్​లో కొంతమంది దాతలు ఆవులకు స్పెషల్ విందుని ఏర్పాటు చేశారు. అంతేకాదు.. రోజువారీ ఫుడ్ కాకుండా భిన్నంగా ఉండేలా ఆహారాన్ని ఏర్పాటు చేశారు కొందరు దాతలు. మామిడికాయల రసం, డ్రై ఫ్రూట్స్ ను ఆవులకు అందించారు. గోవుల మందకు ఏకంగా తినడానికి హారంగా600 కేజీల డ్రైఫ్రూట్స్ ను .. దాహం తీర్చుకోవడానికి   800 కేజీల మ్యాంగో జ్యూస్​ను అందించారు.  మామిడికాయ రసాన్ని ఓ నీటి తొట్టెలో వేశారు.. ఆవులు ఎంతో హుషారుగా చెంగు చెంగున పరుగెడుతూ.. వచ్చి.. నీటి తొట్టిలోని మామిడిపండ్ల రసాన్ని తాగుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆవు పాలలో విటమిన్‌ ఏతో పాటు, పోషక విలువలు అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పోషణ ఖర్చు తక్కువ, రోజుకు 20లీటర్ల వరకూ పాలు ఇస్తాయి. ఆవు పేడ మంచి క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..