Boy falls into borewell : రాహుల్‌ రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌.. 5 రోజులకు బోరుబావిలోంచి బాలుడు..

ఎట్టకేలకు లక్షలాది మంది ప్రార్థనలు ఫలించాయి. బోర్‌వెల్‌లో చిక్కుకున్న రాహుల్ సాహు రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఐదు రోజులు105 గంటలకు పైగా సాగిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు సక్సెస్‌ అయింది.

Boy falls into borewell : రాహుల్‌ రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌.. 5 రోజులకు బోరుబావిలోంచి బాలుడు..
Boy Falls Into Borewell
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 15, 2022 | 8:05 AM

ఎట్టకేలకు లక్షలాది మంది ప్రార్థనలు ఫలించాయి. బోర్‌వెల్‌లో చిక్కుకున్న రాహుల్ సాహు రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఐదు రోజులు105 గంటలకు పైగా సాగిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు సక్సెస్‌ అయింది. బాలుడిని బయటకు తీసేందుకు అధికారులు, సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించింది. ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపాలో బోర్‌వెల్‌లో పడిపోయిన రాహుల్‌ సాహు105 గంటలపాటు అందులోనే నరకయాతన అనుభవించాడు. తీవ్ర పోరాటం అనంతరం రాహుల్‌ను మంగళవారం అర్థరాత్రి సురక్షితంగా బయటకు తీశారు సహాయక సిబ్బంది. దాదాపు ఐదు రోజులుగా 300 మంది రెస్క్యూ టీమ్ అతన్ని సురక్షితంగా బయటకు తీసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎట్టకేలకు బాలుడు సురక్షితంగా బయటపడటంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

జూన్‌ 10 శుక్రవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఇంటివద్ద ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు రాహుల్. ఈ సంఘటన ​చాంపా జిల్లాలో జరిగింది. ఆడుకోవడానికి వెళ్లిన తమ కుమారుడు కనిపించటం లేదని వెతుకుతుండగా.. బాలుడి అరుపులు విని బోరుబావిలో పడిపోయినట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న సీఎం బాధితులకు భరోసా ఇచ్చారు..చెప్పినట్టే దాదాపు 105 గంటల తరువాత బాలుడిని సురక్షితంగా రక్షించారు. బోరుబావిలోంచి ప్రాణాలతో బయటపడ్డ రాహుల్‌ని ప్రత్యేక అంబులెన్స్‌లో బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

రాహుల్ క్షేమంగా బయపడటంతో ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ ట్వీట్ చేస్తూ, “ప్రతి ఒక్కరి ప్రార్థనలు,రెస్క్యూ టీమ్ నిరంతర శ్రమతో రాహుల్ సాహు సురక్షితంగా బయటపడ్డాడని అన్నారు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు సీఎం ట్విట్‌ చేశారు.

జూన్ 10న రాహుల్ బోరుబావి తెరిచిన గుంతలో పడిపోయాడు. పడిన చోట దాదాపు 60 అడుగుల లోతు ఉంది. ఇప్పటి వరకు జరిగిన బోరుబావిలో చిన్నారులు పడిన ఘటనల్లో ఇదే అత్యంత సుదీర్ఘమైన ఆపరేషన్‌గా పరిగణించబడుతుంది. గొయ్యి చుట్టూ రాళ్లు ఉండడంతో కోయడానికి చాలా సమయం పట్టింది. రాళ్లను కోసే సమయంలో రాహుల్‌కు ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

రాహుల్ మాట్లాడలేడు, వినలేడు. అతను 105 గంటలకు పైగా అతడు మృత్యువుతో పోరాడి గెలిచిన రాహుల్‌ని అందరూ మృత్యుంజయుడిగా కొనియాడుతున్నారు. రాహుల్ సురక్షితంగా బయటకు రావడంతో ప్రభుత్వం, యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల ఇక్కడ క్లిక్ చేయండి