Tirumala: శ్రీవారి ఆలయంలో ముగిసిన జ్యేష్టాబిషేకం.. ఏడాది పొడవునా అదే బంగారు కవచంలో స్వామి అమ్మవార్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాబిషేకం మంగళవారంతో ముగిసింది. చివరిరోజు ఉభయ దేవేరులతో కలసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పునదర్శనమిచ్చారు. వచ్చే

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాబిషేకం మంగళవారంతో ముగిసింది. చివరిరోజు ఉభయ దేవేరులతో కలసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పునదర్శనమిచ్చారు. వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంలోనే ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం మలయప్పస్వామివారు ఉభయ నాంచారులతో కలసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేద పారాయణ దారులు సాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు.

శ్రీమలయప్పస్వామివారికి, దేవేరులకు శత కలశ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. సహస్రదీపాలంకరణ సేవ అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటిఈవో రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
