Vastu Tips: ఇంట్లో లైటింగ్ విషయంలోవాస్తు నియమాలను .. ఏ రూమ్‌లో ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలంటే

వాస్తు శాస్త్ర నియమాలు సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి.. అటువంటి పరిస్థితిలో.. ఇంటిలోని ప్రతికూలతను తొలగించడానికి, ఇంటికి కృత్రిమ లైటింగ్ విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి

Vastu Tips: ఇంట్లో లైటింగ్ విషయంలోవాస్తు నియమాలను .. ఏ రూమ్‌లో ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలంటే
Lights Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2022 | 10:08 AM

Vastu Tips: ఇల్లు, ఫ్లాట్ కొన్న వెంటనే ఇంటిని అందంగా కనిపించేలా అలంకరించాలని కోరుకుంటారు. తమ టెస్టుకు తగినట్లు అందంగా ఇంటీరియర్ డెకరేషన్లు చేసి షాన్డిలియర్స్, సైడ్ ల్యాంప్స్, డ్యాన్సింగ్ లైట్లు ఇలా అనేక రకాల లైటింగ్‌లను వేర్వేరు ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటారు. ఇలా లైట్లు ఇంట్లో ఏర్పాటు చేసుకోవోడం వలన ఇల్లు కాంతివంతంగా.. ప్రకాశవంతం చేయడమే కాకుండా, సానుకూల శక్తిని కూడా ప్రవహింపజేస్తుంది. వాస్తు శాస్త్ర నియమాలు సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి.. అటువంటి పరిస్థితిలో.. ఇంటిలోని ప్రతికూలతను తొలగించడానికి, ఇంటికి కృత్రిమ లైటింగ్ విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి. వాస్తు ప్రకారం, ఇంట్లో ఏ భాగంలో, దీపాలు,  బల్బులు మొదలైనవి ఏర్పాటు చేసుకోవడం ద్వారా సుఖ, సంతోషాలు కలుగుతాయో ఈరోజు తెలుసుకుందాం..

రంగుల దీపాలు ఏర్పాటు:  మీరు రంగుల లైట్స్ ను అమర్చాలనుకుంటే.. ఇంటిలోని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు. రంగు రంగుల లైట్స్ ను ఇంట్లో మరే ప్రాంతంలోనూ అమర్చవద్దు. అలా పెట్టుకుంటే ఇంట్లోని వారికీ  ఇబ్బందిని సృష్టిస్తుంది. ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉండదు. పూజ గదిలో  రంగుల దీపాలే కాకుండా జీరో బల్బులను కూడా ఉపయోగించవచ్చు. ఇంటి ఇతర ప్రాంతంల్లో లేత తెలుపు రంగు బల్బ్ ని పెట్టుకోవాలి. దీని వల్ల ఇంట్లో శాంతి నెలకొని ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

లివింగ్ రూమ్‌కి పశ్చిమ దిశలో లైట్ పెట్టుకోరాదు: ఇల్లు లేదా గదిలో పడమర దిశలో లైట్‌ను ఎప్పుడూ అమర్చకూడదు. ఈ దిశలో కాకుండా మీరు ఎక్కడైనా లైట్స్ పెట్టుకోవచ్చు. హాల్ లేదా లివింగ్ రూమ్ ఉత్తర దిశలో ట్యూబ్ లైట్లు అమర్చడం మంచిదని భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుందని, వివాదాలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటుందని నమ్మకం.

ఇవి కూడా చదవండి

బెడ్ రూమ్ లో ఏ దిశలో లైటింగ్ ఉండాలంటే..  బెడ్ రూమ్ లో భార్యాభర్తల మధ్య మంచి బంధాన్ని సృష్టించడానికి..  మంచం ఎదురుగా ఉన్న గోడపై లైట్స్ పెట్టుకోవాలి. ఇది అదృష్టమని భావిస్తారు. భార్యాభర్తల మధ్య  ప్రతికూలత దూరంగా ఉంటుంది. అదే సమయంలో.. బెడ్ రూమ్ లో దక్షిణం వైపు దీపాలు పెట్టడం మానుకోవాలి. ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది.

వంటగది తూర్పు దిశలో కాంతి ఉండాలి:  వంటగదిలో తూర్పు దిశ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వంటగదికి తూర్పు దిక్కున బల్బు పెడితే ఇంట్లో తిండికి, ధనానికి, ధాన్యానికి లోటు ఉండదని చెబుతారు. అంతే కాకుండా వాస్తు నియమాల ప్రకారం సాయంత్రం అయ్యాక ఇంట్లోని అన్ని దీపాలను కాసేపు  వేయడం వలన ఇంట్లో సానుకూలత వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు