AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. పసుపుఆవాలను దానం చేసి చూడండి..

వాస్తు లోపం కారణంగా, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా తరచుగా క్షీణిస్తుంది. కొన్ని జ్యోతిషశాస్త్ర చర్యలు తీసుకోవడం ద్వారా మీరు మీ కుటుంబం, జీవితంలోని ఈ దోషాలను దూరం చేసుకోవచ్చు. పసుపు ఆవాలకు సంబంధించిన కొన్ని నివారణల చర్యల గురించి ఈరోజు తెలుసుకుందాం..

Astro Tips: ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. పసుపుఆవాలను దానం చేసి చూడండి..
Yellow Mustard
Follow us
Surya Kala

|

Updated on: Jun 12, 2022 | 2:48 PM

Astro Tips: ప్రతి ఒక్కరూ జీవితంలో అభివృద్ధిని, సంతోషాన్ని కోరుకుంటారు. అలా జీవించడానికి ప్రతి ఒక్కరూ  కష్టపడతారు. ఒకొక్కసారి కఠోర శ్రమ, అంకితభావంతో పని చేసినప్పటికీ ప్రజలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. దీని వెనుక మీ జీవితంలో లేదా ఇంట్లో ఏదో ఒక లోపం ఉండవచ్చు. ఇటువంటి లోపాలు కుటుంబంలో కలహాలు సృష్టిస్తాయని, అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయని పురాణాల్లో ,జ్యోతిష్య శాస్త్రంలో (jyotishya shastra) చెప్పబడింది. వాస్తు లోపం కారణంగా, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా తరచుగా క్షీణిస్తుంది. కొన్ని జ్యోతిషశాస్త్ర చర్యలు తీసుకోవడం ద్వారా మీరు మీ కుటుంబం, జీవితంలోని ఈ దోషాలను  దూరం చేసుకోవచ్చు. పసుపు ఆవాలకు సంబంధించిన కొన్ని నివారణల చర్యల గురించి ఈరోజు తెలుసుకుందాం..

ఆర్ధిక సమస్యలు తీరడానికి:  జీవితంలో సమస్యలు వస్తూ.. పోతూనే ఉంటాయి. కానీ వాటి ప్రభావం చాలా కాలం జీవితంపై పని చేస్తుంది. డబ్బు నష్టాన్ని సులభంగా అధిగమించలేము. చేతికి అందిన డబ్బులు చేతిలో నిలవక ఆర్ధికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటివారు  పసుపు బట్ట తీసుకుని అందులో పసుపు ఆవాలు కట్టి ఇంటి మెయిన్ డోర్ కు వేలాడదీయాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ పరిహారం డబ్బు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

ప్రతికూల శక్తి ఇంట్లో ప్రతికూల శక్తి ఎదురవుతుంటే.. కుటుంబంలో వివాదాలు, పేదరిక వాతావరణం ఉంటుంది. ఇంట్లో సానుకూలతను కొనసాగించడానికి..  పసుపు ఆవాలు మంచి రెమిడీ..

ఇవి కూడా చదవండి

నర దోషం:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి పురోగతి సాధిస్తే.. ఇతరుల దృష్టి కారణంగా, అతని జీవితంలో కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంది. కనుక దృష్టి దోషం తొలగిపోవాలంటే పసుపు పచ్చి ఆవాలు తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి మెయిన్ డోర్ కు వేలాడదీయాలి.

దానం ధర్మశాస్త్రంలో దానం విశేష ప్రాముఖ్యతను గ్రంధాలలో చెప్పబడింది. నిజమైన భక్తితో దానం చేసిన వ్యక్తి పుణ్యం పొందుతాడని అంటారు. ఒక వ్యక్తి మరణం తర్వాత కూడా స్వర్గాన్ని పొందుతాడని నమ్ముతారు. పసుపు ఆవాలు దానం చేయడం వల్ల మీకు మేలు చేకూరుతుంది. పేదవారికి దానం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)