AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంటికి డోర్ బెల్‌ను ఏర్పాటు చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటంటే..

Vastu Tips: డోర్‌బెల్‌కు సంబంధించిన వాస్తు చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును పొందవచ్చు. ఈరోజు డోర్ బెల్ కు సంబంధించి వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం..

Vastu Tips: ఇంటికి డోర్ బెల్‌ను ఏర్పాటు చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటంటే..
Vastu Of Door Bell
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2022 | 8:13 PM

Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంటిని నిర్వహించడానికి కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. ఈ నియమాలను సరిగ్గా పాటించకపోతే ఇంట్లో దోషాలు ఏర్పడి..  సమస్యలు ఏర్పడతాయి. ఈ దోష ప్రభావం ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది. అంతేకాదు ఒకొక్కసారి.. శారీరక ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తులో (ఇంటికి వాస్తు చిట్కాలు) , ఇంటి నిర్మాణానికి సంబంధించిన దిశలు చెప్పబడ్డాయి. వాస్తు దోషాలు ఒక్కసారి ప్రభావం చూపడం ప్రారంభిస్తే.. వీటి  దుష్ఫలితాలు చాలా కాలం పాటు బాధపడతాయని చెబుతారు. ఇంటి మెయిన్‌ డోర్‌కి అమర్చే గంటకు సంబంధించి వాస్తు విషయంలో కూడా జాగ్రత్తలను వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. డోర్ బెల్ ను  తప్పుగా అమరిస్తే.. ఇంట్లో ప్రతికూలత  ఏర్పడుతుందని.. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారని  నమ్ముతారు. డోర్‌బెల్‌కు సంబంధించిన వాస్తు చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు జీవితంలో సంతోషాన్ని,  శ్రేయస్సును పొందవచ్చు. ఈరోజు డోర్ బెల్ కు సంబంధించి వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం..

డోర్‌బెల్‌ను ఇన్‌స్టాల్ చేయడం ఎందుకు అవసరం అంటే..  వాస్తులో డోర్‌బెల్‌ను ఇన్‌స్టాల్ చేయడం చాలా ముఖ్యం అని చెప్పబడింది. డోర్ బెల్ ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా అడ్డుకుంటుందని నమ్మకం. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు..  డోర్ బెల్ లేని సందర్భంలో తలుపు తడతారు. ఇలా తలుపులు తట్టడంతో ప్రతికూల శక్తి ఇంట్లోకి వస్తుందని అది ఇంట్లో నివసించే వారి మనస్సుపై కూడా చెడు ప్రభావం చూపుతుందని నమ్మకం.

నేమ్ ప్లేట్ పైన డోర్ బెల్: చాలా ఇళ్లలో మెయిన్‌ డోర్‌కు పెట్టాల్సిన డోర్‌ బెల్‌ అమర్చడంలో పొరపాట్లు చేస్తున్నారు. ఇలాంటి పొరపాటు ఇంటి పెద్దకి ఇబ్బందులు కలిగిస్తుంది. వాస్తు ప్రకారం, మెయిన్ డోర్‌పై అమర్చే డోర్‌బెల్ ఎల్లప్పుడూ నేమ్ ప్లేట్ పైన ఉంచాలి. ఇది కుటుంబ పెద్ద కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఎంత ఎత్తులో డోర్ బెల్ పెట్టాలంటే..  వాస్తు శాస్త్రంలో మెయిన్ డోర్ మీద డోర్ బెల్ ఏ ఎత్తులో పెట్టాలో కూడా చెప్పబడింది. కనీసం 5 అడుగుల ఎత్తులో ఉండాలని.. అది శుభప్రదమని చెప్పారు. దీని వల్ల ఒక ప్రయోజనం ఏమిటంటే, పిల్లలు పదే పదే డోర్ బెల్ ను రింగ్ చేయలేరు..

డోర్ బెల్ గా గంట శబ్దం: ఇంటి డోర్ బెల్ గా గంట శబ్దాన్ని ఏర్పాటు చేస్తే.. అది ప్రతికూలత రాకకు కూడా కారణం కావచ్చు. బిగ్గరగా శబ్దం చేసే  డోర్‌బెల్ మంచిది కాదు. మధురంగా ​​వాయిస్ ఉండే డోర్ బెల్.. మనసుకి ప్రశాంతనిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)