Andhra Pradesh: అంబాజీపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇంట్రెస్టింగ్ సీన్.. సంతోషంలో భక్తులు..
Andhra Pradesh: అంబాజీపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు చిరునవ్వు నవ్వతూ..
Andhra Pradesh: అంబాజీపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు చిరునవ్వు నవ్వతూ, ఆనందించారు. ఇంతకీ ఏంటా సీన్, భక్తులకు ఎందుకు నవ్వొచ్చింది. సాధారణంగానే చిన్న పిల్లలు ఏ పనిచేసినా ముద్దుగా అనిపిస్తుంటుంది. ఇక నలుగురు మెచ్చుకునే పనిచేస్తే, చూసిన వారందరూ మురిసిపోతారు. తాజాగా, కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఓ పిల్లాడిని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అతను చేసిన పనిని చూసి నవ్వుకున్నారు. అంబాజీపేటలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. శనివారం కావడంతో, స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, ప్రధాన పూజారి గర్భగుడిలో ఉన్నారు.
భక్తులకు దర్శనం, ధూప, దీప నైవేధ్యాలు ఇస్తున్నారు. ఇక్కడిదాకా కామన్‌గానే ఉన్నా, బయట ఒక చిన్న పూజారి దర్శనమిచ్చారు. భక్తులకు తీర్థం ఇవ్వడంతో పాటు శఠగోపం పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. కాస్త ఎత్తున్న భక్తులు ఆయన దగ్గరికి వెళ్లడంతో, పైకి ఎగిరెగిరి మరి, ఆశీర్వాదాలు అందించారు. ఆ బాల పూజారితో శఠగోపం పెట్టించుకున్న భక్తులు తెగ సంభరపడిపోయారు. చూడ్డానికి సంతోషంగా ఉండటంతో, మళ్లీమళ్లీ వెళ్లి పూజారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఏడెనిమిది ఏళ్లు కూడా లేని బాల పూజారి చేస్తున్న పనులు చూసి, గుడికి వచ్చిన భక్తులు ముచ్చటపడ్డారు. చిన్న వయస్సులోనే ఎంత మంచి చేస్తున్నాడు.. ఉంటూ బాల పూజారిని మెచ్చుకున్నారు భక్తులు. ఆ చిన్నారి వేషధారణ కూడా భక్తులను ఆకట్టుకుంది. కట్టు, బొట్టు బాగుందని అతనితో సరదాగా మాట్లాడారు భక్తులు. అయితే, భక్తులు నవ్వుకున్నా, ఏం చేసినా, ఆ బాలుడు మాత్రం తన పని తాను చేసుకున్నాడు. ఈ బాల పూజారి చిన్నారులందరికీ ఆదర్శమని పొగడ్తలతో ముంచెత్తారు భక్తులు.