- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips put these things on the main door of the house for happiness and prosperity
Vastu Tips: ఈ వస్తువులను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెడితే.. లక్ మీ సొంతమట..
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులు ఉండటం వల్ల సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. అంతేకాదు ప్రతికూలతను తొలగిస్తుంది. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
Updated on: Jun 12, 2022 | 7:31 PM

వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంట్లోసుఖ సంపదలు లభిస్తాయట.

తోరణం: ఇంటి ప్రధాన ద్వారానికి తోరణం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి, రావి, అశోక ఆకులతో పాటు బంతి పువ్వులతో మాల వేయవచ్చు. ఈ ఆకులు ఎండిపోయినప్పుడు, మీరు వాటిని తీసివేసి..మళ్ళీ తోరణంగా తాజా ఆకులను తయారు చేసి ఉపయోగించవచ్చు.

శుభం గుర్తు: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా శుభప్రదమైన గుర్తుని వేయడం చాలా మంచిదని భావిస్తారు. ఇది ప్రతికూలత,చెడు నుండి రక్షిస్తుందని నమ్మకం.

లక్ష్మీ దేవి పాదాలు: దీపావళి పూజ సమయంలో ఇంట్లో లక్ష్మీ పాదాలను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఇంటి ప్రధాన ద్వారం మీద లక్ష్మీ పాదాల గుర్తులను వేసుకోవచ్చు. ఇది ఇంట్లో సంపద సంతోషాన్ని తెస్తుంది

స్వస్తిక్ - స్వస్తిక్ చిహ్నం హిందూమతంలో ప్రతి పనిని ప్రారంభించే ముందు కుంకుమ, గంధాన్ని ఉపయోగించి చేస్తారు. ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ వేయండి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లోని సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)




