గణేష్‌ ఉత్సవాలపై అదే ఉత్కంఠ.. మళ్లీ ప్రారంభమైన POP vs మట్టి విగ్రహాల వార్

Vinayaka Chavithi 2022: కాలుష్యానికి కారణం ప్లాస్టర్ ఆఫ్‌ పారిస్ కాదని.. అంతా మట్టి విగ్రహాలతోనే అని ఎన్విరాన్‌ మెంటల్ ప్రొటక్షన్ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌(EPTRI) ఇచ్చిన రిపోర్ట్ మరింత చర్చకు దారితీస్తోంది.

గణేష్‌ ఉత్సవాలపై అదే ఉత్కంఠ.. మళ్లీ ప్రారంభమైన POP vs మట్టి విగ్రహాల వార్
Eco-Friendly Ganesha
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 15, 2022 | 1:37 PM

Ganesh Chaturthi 2022: పర్యావరణం గొప్పదా? ప్రజల ప్రాణాలు నిలిపే జీవనాధారం గొప్పదా? ఈ ప్రశ్న అనేక సందర్భాల్లో వినిపిస్తుంది. ఇప్పుడు… హైదరాబాద్ గణేష్‌ ఉత్సవాల్లో కూడా ఇదే ప్రశ్న సవాల్ గా నిలుస్తోంది. మరోవైపు.. కాలుష్యానికి కారణం ప్లాస్టర్ ఆఫ్‌ పారిస్ కాదని.. అంతా మట్టి విగ్రహాలతోనే అని ఎన్విరాన్‌ మెంటల్ ప్రొటక్షన్ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌(EPTRI) ఇచ్చిన రిపోర్ట్ మరింత చర్చకు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితులు మధ్య మట్టి గణపతే మహాగణపతి అనే నినాదంపై మరో సారి బహిరంగ చర్చ జరగాలనే డిమాండ్ ఊపందుకుంది.

హైదరాబాద్ లో గణేష్‌ ఉత్సవాలు అంటేనే దేశంలోనే అతిపెద్ద ఈవెంట్. ఇక్కడ గణనాధుని విగ్రహాలు.. శోభాయాత్ర… ముంబైలోని గణపతి ఉత్సవాలతో పోటీ పడతాయి. ఇలాంటి హైదరాబాద్‌ గణేషుడి ఉత్సవాలకు ఇప్పుడు అనేక అవరోధాలు అడ్డంగా నిలుచున్నాయి. అందులో ప్రధానంగా విగ్రహాలు తయారీ అనేది ప్రధాన చర్చగా మారిపోయింది. ప్లాస్టో ప్యారిస్ తో తయారు చేసే విగ్రహాలు హుస్సేన్ సాగర్ నుంచి ఎలాంటి చెరువుల్లోనూ కలపడం ..కాలుష్యానికి ప్రధాన కారణమని పర్యావరణ వేత్తలు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. చివరికి ఈ విగ్రహాల కాలుష్యం .. కోర్టులకు చేరింది.

పేరుకు నవరాత్రులే అయినా… పదిరోజుల పాటు హైదరాబాద్‌ లో గణనాధుని ఉత్సావాలు జరిగిన తర్వాత.. 11వరోజు భారీ శోభాయాత్ర.. ఆ తరువాత హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం. ఇప్పుడు ఇక్కడే అసలు … ఆర్గ్యుమెంట్ ప్రారంభమయ్యాయి. మట్టి విగ్రహాలే మహా గణపతి అనే నినాదం నుంచి ప్లాస్టో ప్యారిస్ తో విగ్రహాలు తయారీ పర్యావరణానికి చేటు అనే వాదనల వరకూ వెళ్లాయి. చివరికి విగ్రహాలు ఎంత ఎత్తు ఉండాలి అనే చర్చలు సాగుతున్నాయి. వీటిని పక్కన పెడితే…. హైదరాబాద్ గణేష్‌ ఉత్సవాల్లో ఎన్ని కోట్ల రూపాయలు ఆదాయం టర్నోవర్ జరుగుతోంది? ఎన్ని వేల మంది కళాకారులు వీటిపై జీవనం సాగిస్తున్నారు. పదకొండు రోజుల ఉత్సవాల్లో… వినాయక చవితి నుంచి శోభాయాత్ర ముగిసే వరకూ … ఎన్ని వేల మంది ఈ ఉత్సవాలపై బతుకు సాగిస్తున్నారు? ఈ ఉత్సవాలు ఇలా కొనసాగకపోతే.. వీళ్లంతా ఏమై పోతారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా నిలబడుతోంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ లో గణేష్‌ ఉత్సవాలు అంటే.. ఆషామాషీ కాదు. గణేష్‌ విగ్రహాలు నుంచి… శోభాయాత్రలో పాల్గోనే భక్తుల వరకూ.. ఒక భారీ ఈవెంట్. హైదరాబాద వినాయక చవితి ఉత్సవాల్లో 5నుంచి 6వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది. ఒక్క విగ్రహాల తయారీలోఏ 25వేల మంది కళాకారులు వివిధ రూపాల్లో భాగస్వాములు అవుతున్నారు. విగ్రహాలు తయారీ.. దానికి అనుబంధంగా సాగే పనులు. పందిళ్లు నిర్మాణం, విగ్రహాల తరలింపు, పూజలు, పూజాసామాగ్రి, డెకరేషన్‌, ఉత్సవాలు, చివరికి శోభాయాత్రలోఉపయోగించే వాహనాలు, క్రేన్ లు ఇలా అన్ని రూపాల్లో 70 నుంచి 80వేల మంది ఆధారపడినట్లు లెక్కలు తేల్చిచెబుతున్నాయి.

Eco Ganesh2

Eco-Friendly Ganesha

పండగలు.. ఇందులో ప్రత్యేకంగా హైదరాబాద్ గణేష్‌ ఉత్సవాలపై ఒక రీసెర్చ్ సాగింది. ఉత్సవాలు సోషియో ఎకనమిక్ స్టడీ నిర్వహించారు. కర్నాటక సెంట్రల్ యూనివర్సీటీ ప్రొఫెసర్ డాక్టర్ లింగమూర్తి ఒక సంపూర్ణమైన స్టడీ చేశారు. ఆయన గతంలో హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీ గతంలో పనిచేశారు. చిన్నా పెద్ద విగ్రహాలు లెక్కలు తేల్చారు. కేవలం పెద్ద విగ్రహాలే లక్షకు పైగా ఇక్కడ తయారవుతున్నట్లు గుర్తించారు. గణేష్‌ ఉత్సవాల వల్ల దేశవ్యాప్తంగా 20వేల కోట్ల బిజినెస్ సాగుతుంటే.. హైదరాబాద వాటా చాలా కీలకమైనదిగా ఆయన పరిశోధనలో తేల్చారు. దేశ కాంపౌండ్ గ్రోత్ రేట్ (CAGR) లో20శాతం గణేష్‌ ఉత్సవాలు భాగం పంచుకుంటున్నాయంటున్నారు కర్నాటక సెంట్రల్ యూనివర్సీటీ ఆర్థికశాస్త్రవేత్త డాక్టర్ లింగమూర్తి.

అయితే… ఇప్పుడు కాలుష్యం అంతా ప్లాస్టర్ ఆఫ్‌ పారిస్ విగ్రహాలతోనే అనే వాదనపై యుద్ధమే చేస్తోంది భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటి. పాస్టర్ ఆఫ్‌ పారిస్POP వల్ల… నిమజ్జనానలలో నీటికి ఎలాంటి కాలుష్యం అంటదని EPTRI- ఎన్విరాన్‌ మెంటల్ ప్రొటక్షన్ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ ఇచ్చిన రిపోర్ట్ పై చర్చ జరగాలంటోంది. POP విగ్రహాలు… 60 రోజుల వరకూ నీటిలో కరగవని… నిమజ్జనానల్లో 48గంటల్లోనే విగ్రహాలను తొలగించడం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదనేది ఈ రిపోర్టు సారాంశం. పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డుకు అనుబంధంగా అథంటిక్‌ సంస్థగా ఉన్న EPTRI గతంలో ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు గణేష్‌ ఉత్సవ కమిటీ సాక్ష్యంగా చూసిస్తోంది. మరోవైపు EPTRI రిపోర్టు ప్రకారం వెంటనే నీటిలో కరిగిపోయే మట్టివిగ్రహాలు వల్ల చెరువులు..కుంటలు.. నీటి వనరుల్లో పూడికలు పెరిగుతాయని పేర్కొనడంతో మట్టిగణపతే మహాగణపతి అనే నినాదానికి దూరంగా ఆలోచన చేయాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. EPTRI- రిపోర్టుపై ప్రభుత్వం..పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు.. పర్యావరణవేత్తలు బహిరంగ చర్చకు రావాలనే డిమాండ్‌ను గణేష్‌ ఉత్సవ కమిటీనాయకులు భగవంతరావు, శశిధర్‌ చేస్తున్నారు.

Khairatabad Ganesh

Khairatabad Ganesh

భాగ్యనగరంలో జరిగే గణేష్‌ ఉత్సవాలుపై జరిగిన పరిశోధనల్లో కేవలం ఇది ఒక పండుగ కాదు… అనేక మంది ఉపాధిని, జీవనోపాధిని కల్పించే పండుగగా చూడాలనే సారాంశాన్ని చెబుతోందంటోంది భాగ్యనగర్ గణేష్‌ ఉత్సవ కమిటీ. హైదరాబాద్ ఉత్సవాలు 25వేల కటుంబాలకు ఉపాధి కల్పిస్తుందటే.. 80వేల మందికిపైగా వివిధ ఉత్సవ అనుబంధ వృత్తుల వారికి జీవనోపాధికల్పిస్తోందంటోంది. విగ్రహాల తయారీ దారులు 20 నుంచి 25 వేల మంది ఉంటే, 15వందల మందిపురోహితులు, పూజాసామగ్రి తో పాటు శోభాయాత్ర వరకు వివిధ రంగాలకు సంబంధించిన వారు 45వేల మంది.. ఆరునెలలపాటు ఉపాధి పొందుతున్నారంటోంది. ఇందులో అన్ని వర్గాల వారూ ఉన్నారనే విషయాన్ని గమనించాలంటోంది భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటి సభ్యులు శశిధర్.

ధూల్ పేట్, నాగోల్, ఎల్ బి నగర్‌, వనస్థలిపురం, పఠాన్ చెరు, కూకట్ పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో ఈ విగ్రహాలు తయారీ భారీ ఎత్తునే సాగుతుంది. ఉత్సవాలు నిర్వహణ శోభాయాత్ర వరకూ… గణేషుడి ఉత్సవాలు ఎలా నిర్వహించాలనేది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలంటున్నారు భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటి ప్రతినిధి శశిధర్. మట్టి విగ్రహాలా, ప్లాస్టో ప్యారిస్సా అనేది భక్తులకు కొలమానం కాదు.. ఏ రూపంలో ఉన్నా వినాయకుడ్ని పూజిస్తామని.. అయితే… నిమజ్జనానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై న్యాయస్థానాలు ఇచ్చిన సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటి సభ్యులు శశిధర్. పర్యావరణం… కాలుష్యం… వీటన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత ఉంది. కానీ దాని కంటే..కొన్నివేల మంది జీవనోపాధి దెబ్బతినకుండా .. మన పండుగలను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనేవాదన తెరపైకి వస్తోంది. నిజంగా విగ్రహాలనిమజ్జనం వల్ల అంత కాలుష్యం ఉందా? జరుగుతున్న ప్రచారం ఎంత? వాస్తవ పరిస్థితులు ఏమిటి? పర్యావరణవేత్తలు చెబుతున్న దానిలో నిజమెంత? కాలుష్య నియంత్రణ మండలి రీసెర్చ్ ల ద్వారా తేల్చిన క్షేత్రస్థాయి పరిస్థితులేంటి? అనేది సాక్ష్యాలతో పాటు ప్రజల ముందు ఉంచడానికి తాము సిద్ధంగా ఉన్నామంటోంది భాగ్యనగర్ ఉత్సవ కమిటి.

పొల్యూషన్‌.. పర్యావరణం.. ఈమాటలకు అర్థం మాట పక్కన పెడితే… విగ్రహాల తయారీ ఆగిపోతే. ఏం కావాలి. రేపు అనేది ఏమవుతుంది? కుటుంబాల పోషణ ఏంకావాలి? లక్షలరూపాలు అప్పుచేసి తెచ్చిన మెటీరియల్స్… తయారై ఆగిపోయిన విగ్రహాలు కొనుగోలు లేకపోతే. ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా అనే మీమాంస మధ్య… నిజంగా దిక్కుతోచని స్థితిని విగ్రహాల తయారీ నుంచి శోభాయాత్ర రవాణా వరకూ ఉండే వివిధ వర్గాల కళాకారులు , కార్మికులు ఎదుర్కొటున్నారు.

రెండేళ్ల కరోనా కాలం… గణేష్‌ శోభాయాత్ర సాగలేదు. ఇదిగో ఇలా తయారుచేసిన విగ్రహాలు మిగిలిపోయాయి. లక్షల రూపాయలు అప్పులు చేసి తీసుకువచ్చి తయారుచేయించిన మూర్తులు… మూలన పడ్డాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా… ఈ ఏడాది నిమజ్జనం ఉంటుందా?లేదా ? అనే దానికి గ్రీన్ నిగ్నల్ లేదు. ఏం చేయాలి. ఎలా బతకాలి? చేసిన అప్పులు ఎలా తీర్చాలి. చివరకు ఆత్మహత్యలు తప్ప మరే దిక్కు లేదంటున్నారు విగ్రహ తయారీదారుడు శ్రీనివాస్. తాతలు తండ్రుల..ఇప్పుడు మేము.. మాతరవాత మా పిల్లలు.. ఇదే కళకు అంకితమయ్యాము. ఒక్క తెలంగాణ నుంచే కాదు… ఇతర ప్రాంతాలనుంచి ఇక్కడ కు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాం. ఇప్పుడు విగ్రహాల తయారీ ..దినదిన గండం..నూరేళ్ల ఆయుష్సులా ఉంది. వీటిని నిషేదిస్తే… తయారీని నిలుపుచేస్తే.. తమ కుటుంబాలు ఏమవుతాయని గగ్గోలు పెడుతున్నారు మరికొందరు కళాకారులు. విగ్రహాల తయారీ కి ముందు… డై తయారీ కీలకం. అంటే… విగ్రహాలు అచ్చుపోయడానికి ముందుగా తయారయ్యే మూలవిగ్రహం. ఇది రబ్బర్ లాంటి మెటీరియల్ తో తయారుచేస్తారు. ఈ విగ్రహం పై పైబర్ పోత పోయడం ద్వారా విగ్రహాల డై లు తయారవుతాయి. ఇలాంటి కీలకమైన కళాకారులు ఏడాదంతటికి ఒక్కసారే పని ఉంటుంది. ప్రతి ఏడాది విగ్రహాల డిజైన్ మారిపోవాలి. అప్పుడు పని. కానీ ఇప్పుడు విగ్రహాల తయారీ పై అనేక అనుమానాలతో ఈ కళాకారులు ఎలా బతకాలో తెలీడంలేదంటున్నారు.

విగ్రహాల తయారీలో కళాకారులే కాదు.. వీటికి కావాల్సిన మెటీరియల్స్. వీటిని తరలించేవారు. ఇలా ప్రత్యక్షంగా విగ్రహాలతయారీలో భాగస్వాములయ్యే వారు సైతం రేపు అనేది ఎలా గడుస్తుందనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న లోన్లకు చెల్లింపులు చేయలేని దుస్థితి ఎదుర్కొంటున్నామంటున్నామంటున్నారు .

పర్యావరణం అంటే..మన కోసమే కాదు..మన తర్వాత తరాలు కూడా బతికే పరిస్థితి అంటారు పర్యావరణ వేత్తలు. అయితే.. ఈ తరమే బతికే పరిస్థితులు లేకపోతే.. భావి తరాల భవిష్యత్ ఆలోచనలు ఎలా చేయాలంటోంది బతుకు తెరువు. ఇప్పుడు ఇదే చర్చ .. గణేషుడి ఉత్సవాలకూ ఎదురవుతోంది.

(వై.గణేష్‌, టివి9 తెలుగు, హైదరాబాద్‌)

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో