AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్యాంట్రీకార్లలో గ్యాస్‌ సిలిండర్లకు బదులు..

Railways News/ IRCTC: రైళ్లలో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వంట వండే ప్యాంట్రీ కార్లలో గ్యాస్‌ సిలిండర్ల వినియోగంపై నిషేధం విధించింది. వీటికి బదులు ఎలక్ట్రిక్‌ ఇండక్షన్లను వినియోగించాలని అన్ని జోనల్‌ రైల్వేలకు ఐఆర్సీటీసీ (IRCTC) లేఖ రాసింది

Indian Railways: అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్యాంట్రీకార్లలో గ్యాస్‌ సిలిండర్లకు బదులు..
Indian Railways
Basha Shek
|

Updated on: Jun 15, 2022 | 11:59 AM

Share

Railways News/ IRCTC: రైళ్లలో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వంట వండే ప్యాంట్రీ కార్లలో గ్యాస్‌ సిలిండర్ల వినియోగంపై నిషేధం విధించింది. వీటికి బదులు ఎలక్ట్రిక్‌ ఇండక్షన్లను వినియోగించాలని అన్ని జోనల్‌ రైల్వేలకు ఐఆర్సీటీసీ (IRCTC) లేఖ రాసింది. ‘LPG గ్యాస్‌ అత్యంత ప్రమాదకరమైనది. సిలిండర్‌ పేలడం లేదా గ్యాస్‌ లీకేజీ కావడం వల్ల భారీ అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందుకే హై లెవల్ సేఫ్టీ రివ్యూ కమిటీ సిఫార్సుల దృష్ట్యా, ప్యాంట్రీ కార్లలో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. వీటి స్థానంలో ఎలక్ర్టిక్‌ ఇండక్షన్‌ పరికరాలు వినియోగించాలి. ప్రస్తుతమున్న LPG ఆధారిత ప్యాంట్రీ కార్లను ఫ్లేమ్‌లెస్ ప్యాంట్రీ కార్లుగా మార్చడానికి సుమారు రూ. 60 లక్షలు ఖర్చవుతుంది. అయినా ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.’

ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు..

త్వరలోనే మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జోడించబడిన అన్ని ప్యాంట్రీ కార్లు ఫ్లేమ్‌లెస్ ఎలక్ట్రిక్ డిజైన్‌గా మార్చడాన్ని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పైగా ఇండక్షన్‌ సిస్టమ్స్‌ ప్యాంట్రీ కార్లతో అగ్నిప్రమాదాలు తగ్గడమే కాకుండా.. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గుతుంది. ఫలితంగా పర్యావరణానికి మేలు కలుగుతుంది’ అని ఈ లేఖలో పేర్కొంది ఐఆర్సీటీసీ. కాగా ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఐఆర్సీటీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలకు సంబంధించి ఏవైనా ఉల్లంఘనలు జరిగితే సంబంధిత ఏజెన్సీలకు భారీగా జరిమానాలు విధిస్తామని, అదేవిధంగా లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయవార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

TV9 Global Summit: జూన్ 17 నుంచి TV9 థాట్‌ ఫెస్ట్‌.. హాజరుకానున్న ముగ్గురు సీఎంలు.. 14 మంది కేంద్ర క్యాబినేట్‌ మంత్రులు..

India Corona: దేశంలో కరోనా డేంజర్‌ బెల్స్‌.. మళ్లీ భారీగా పెరిగిన కొత్త కేసులు.. మూడు నెలల తర్వాత ఇవే అత్యధికం..

IND vs SA: అదరగొట్టిన యువ భారత్‌.. విశాఖలో టీమిండియా విజయానికి కారణాలివే..