AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

On This Day: 40 ఓవర్లలో 45 పరుగులు.. ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత బోరింగ్‌ మ్యాచ్‌..

On This Day in Cricket:అంతర్జాతీయ క్రికెట్‌లోకి పొట్టి ఫార్మాట్‌ అడుగుపెట్టాక ఏ జట్టు అయినా కేవలం 4-5 ఓవర్లలోనే 45-50 పరుగులు చేస్తున్నారు. వన్డే మ్యాచ్‌లోనూ 7-8 ఓవర్లలోనే స్కోరుబోర్డుపై 50 రన్స్‌ కనిపిస్తున్నాయి.

On This Day: 40 ఓవర్లలో 45 పరుగులు.. ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత బోరింగ్‌ మ్యాచ్‌..
Basha Shek
|

Updated on: Jun 14, 2022 | 9:35 AM

Share

On This Day in Cricket:అంతర్జాతీయ క్రికెట్‌లోకి పొట్టి ఫార్మాట్‌ అడుగుపెట్టాక ఏ జట్టు అయినా కేవలం 4-5 ఓవర్లలోనే 45-50 పరుగులు చేస్తున్నారు. వన్డే మ్యాచ్‌లోనూ 7-8 ఓవర్లలోనే స్కోరుబోర్డుపై 50 రన్స్‌ కనిపిస్తున్నాయి. ఇక టీ 20 ఫార్మాట్‌లో అయితే చాలాసార్లు కేవలం ఒకే ఒక ఓవర్లోనే 37-38 పరుగులు చేయడం మనం చాలా సార్లు చూశాం. ఇక ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 434 పరుగులు సాధించగా.. బదులుగా దక్షిణాఫ్రికా 438 పరుగులు చేసి తమకు తామే సాటి అనిపించుకుంది. ఇక ఒక మ్యాచ్‌లో అయితే ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 487 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్‌లు ఉన్నట్లే.. అప్పుడప్పుడు స్లో ఇన్నింగ్స్‌లు కూడా ఉన్నాయి. ఒక ప్రపంచకప్‌లో టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ 174 బంతుల్లో 36 పరుగుల ఇన్నింగ్స్ దీనికి చక్కటి ఉదాహరణ. ఈక్రమంలో 43 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత బోరింగ్‌ మ్యాచ్‌ ఒకటి జరిగింది. ఆ మ్యాచ్‌ విశేషాలు తెలుసుకుందాం రండి.

జిడ్డూ బ్యాటింగ్ తో..

1979 ప్రపంచకప్ లో భాగంగా జూన్‌ 14 న ఈ షాకింగ్ అండ్‌ బోరింగ్ మ్యాచ్ జరిగింది. వరల్డ్‌ కప్‌లో ఎనిమిదో మ్యాచ్‌లో భాగంగా కెనడా, ఇంగ్లండ్‌లు మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్ జూన్ 13నే జరగాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా వాయిదా పడింది. క్రికెట్‌లో అప్పటికింకా కెనడా పసికూన. మరోవైపు ఇంగ్లండ్‌ జట్టు చాలా బలంగా ఉంది. అందుకు తగ్గట్లే కెనడా 45 పరుగులకే ఆలౌటైంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ 45 పరుగులు చేయడానికి కెనడాకు ఏకంగా 60 ఓవర్లలో 40.3 ఓవర్లు అవసరమయ్యాయి. అంటే 243 బంతులు. కెనడా తరుపున ఫ్రాంక్లిన్ డెన్నిస్ మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. 2 ఫోర్ల సహాయంతో 21 పరుగులు చేశాడు. ఇందుకు ఫ్రాంక్లిన్ కూడా 99 బంతులు ఆడడం విశేషం. ఇంగ్లండ్‌ తరఫున క్రిస్‌ ఓల్డ్‌ 10 ఓవర్లలో 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. బాబ్ విల్లీస్‌కు 4 వికెట్లు దక్కాయి.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌ కూడా అదే దారిలో.. కాగా ఈ మ్యాచ్‌లో కెనడా స్లో ఇన్నింగ్స్ తర్వాత మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 3 గంటల ఆలస్యంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఇక్కడ 46 పరుగుల ఛేజింగ్ పెద్ద విషయం కాదు. పైగా పటిష్ఠమైన ఇంగ్లండ్‌ జట్టుకు అతి పెద్ద టార్గెట్‌ కూడా కాదు. అయితే మరీ కెనడాలా కాకున్నా ఇంగ్లండ్‌ కూడా చాలా నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసింది. 11 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే 46 పరుగులను ఛేదించేందుకు ఇంగ్లండ్‌కు ఏకంగా 13.5 ఓవర్లు అంటే 83 బంతులు అవసరమయ్యాయి. ఇలా రెండు జట్లు తమ బోరింగ్‌ బ్యాటింగ్‌తో ప్రేక్షకులకు విసుగు తెప్పించడంతో ఈ మ్యాచ్‌ చరిత్రలో అలా నిలిచిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Keerthy Suresh: కేరళలో వాలిన కళావతి.. స్నేహితురాలి పెళ్లిలో సందడే సందడి.. వైరలవుతోన్న ఫొటోలు..

Ranbir Kapoor: వివాహమైన మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లాం.. మ్యారేజ్‌ లైఫ్‌పై చాక్లెట్‌ బాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Kajal Agarwal: ముద్దుల కుమారుడి మరో ఫొటోను షేర్‌ చేసిన చందమామ.. ఈసారి ముఖం కనిపించేలా.. వైరలవుతోన్న క్యూట్‌ ఫొటో..